ఆమెకు 14 ఏళ్ల కిందట వివాహం జరిగింది. కొంత కాలానికి ఓ కూతురు, కుమారుడు జన్మించారు. ఇక అంతా బాగానే ఉందనుకున్న తరుణంలో ఆ వివాహిత ఊహించని దారుణానికి పాల్పడింది. అసలేం జరిగిందంటే?
ఆమెకు 14 ఏళ్ల కిందట ఓ వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లైన చాలా కాలం పాటు భార్యాభర్తలు సంతోషంగా జీవించారు. ప్రేమ, అప్యాయతలతో ఒకరికి ఒకరు తోడుగా నిలిచారు. అలా కొన్నాళ్లకి ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. దీంతో వీరి సంసార జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. ఇక అంతా బాగానే ఉందనుకున్న తరుణంలోనే ఈ వివాహిత అడ్డదారులు తొక్కినట్లు తెలుస్తుంది. పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నా బరితెగించి ప్రవర్తించి చివరికి ఎవరూ ఊహించని దారుణానికి పాల్పడింది. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని విజయనగరం జిల్లా కొత్తవలస మండలం తుమ్మికాపల్లి. ఇదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో అడ్డూరి విజయలక్ష్మికి 14 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి పెళ్లైన నాటి నుంచి ఎలాంటి గొడవలు లేకుండా సంసారాన్ని కొనసాగించారు. కొంత కాలానికి వీరికి ఓ కూతురు, కుమారుడు జన్మించారు. ఇక భర్త స్థానికంగా ఓ గ్యాస్ కంపెనీలో పని చేస్తూ కుటుంబాన్ని పోషించాడు. ఇక అంతా బాగానే ఉందనుకున్న తరుణంలోనే అతని భార్య విజయలక్ష్మి తన వక్రబుద్దిని చూపించింది. స్థానికంగా ఉన్న ఓ వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించినట్లు తెలుస్తుంది. పనికి వెళ్తున్నానని చెప్పి రాత్రిళ్లు ఇంటికి వచ్చేది. భార్య ప్రవర్తనపై భర్తకు అనేక సార్లు అనుమానం వచ్చింది.
ఇలాంటి పనులు మానుకోని బుద్దిగా ఉండాలంటూ హెచ్చరించాడు. అయినా తన ప్రవర్తను మార్చుకోని విజయలక్ష్మి.. అదే పనిగా ప్రియుడితో కలిసి తిరిగినట్లు సమాచారం. ఇక భార్య తీరుతో విసుగిపోయిన భర్త.. భార్యను గట్టిగా మందలించాడు. ఈ క్రమంలోనే విజయలక్ష్మి కోపంతో ఊగిపోయింది. ఇలా అయితే కాదని, ఎలాగైన భర్తను చంపాలని ప్లాన్ గీసింది. అనుకున్నదే ఆలస్యం.. ఆ వివాహిత ఆ దిశగా ప్రయత్నాలు కూడా మొదలు పెట్టింది. అయితే, ఇందులో భాగంగానే 2019 సెప్టెంబర్ 2న రాత్రి భర్త నిద్రపోయింది చూసి ఆ వివాహిత కత్తితో అతనిపై దాడి చేసింది.
కుటుంబ సభ్యులు వెంటనే గమనించి అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇక చికిత్స పొందుతూ ఆ వ్యక్తి మరుసటి రోజే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై మృతుడి కుటుంబ సభ్యులు స్పందించి అతని భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అప్పటి నుంచి దర్యాప్తు చేపట్టారు. అయితే, ఈ దారుణ ఘటనపై స్పందించిన న్యాయస్థానం.. తాజాగా నిందితురాలికి జీవిత ఖైదుగా శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. దీంతో పాటు రూ.1000 జరిమానా కూడా విధించింది.