అది విజయనగరం జిల్లా జామి మండలంలోని అంబేడ్కర్ నగర్ కాలనీ. ఇదే ప్రాంతానికి చెందిన దేవి(26), ప్రసన్నకుమార్ భార్యాభర్తలు. వీరికి గత ఐదేళ్ల కిందటే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. భర్త గ్రామ విద్యా వాలంటీర్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పెళ్లైన కొంత కాలం ఈ దంపతులు సంతోషంగానే గడిపారు. కానీ పెళ్లై అయిదేళ్లు అవుతున్నా వీరికి ఇంకా పిల్లలు కలగలేదు. దీంతో ఇరుగు పొరుగు వారు, అత్తింటివారు సైతం దేవిని సూటిపోటి మాటలతోనే హింసించేవారు. అయినా వీరి మాటలు లెక్కచేయని దేవి ముందుకు వెళ్తోంది.
ఇక ఒకానొక సమయంలో దేవికి కూడా పెళ్లై ఇన్నేళ్లు అవుతున్నా పిల్లలు కలగడం లేదన్న బాధతో లోలోపల కుమిలిపోయేది. ఎవరికి చెప్పాలో తెలియదు. ఏం చేయాలో తోచదు. పడుకున్నా, తింటున్నా, పనిలో ఉన్నా కూడా ఇవే ఆలోచనలతో బాధపడేది. దీనికి తోడు ఇరుగు పొరుగు వారు సూటిపోటిమాటతో ఇక తట్టుకోలేకపోయింది. ఆదివారం భర్త లేని టైమ్ చూసిన దేవి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఆమెను కిందకు దించి ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.
కానీ అప్పటికే దేవి ప్రాణాలు విడిచింది. ఈ విషయం తెలుసుకున్న భర్త ప్రసన్న కుమార్ శోక సంద్రంలో మునిగిపోయారు. స్థానికుల సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. పెళ్లై అయిదేళ్లు అవుతున్నా పిల్లలు కలగలేదన్న కారణంతో ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఇలా పెళ్లై చాలా ఏళ్లైనా పిల్లలు కలగడం లేదని ఆత్మహత్యకు పాల్పడుతున్న వారికి మీరు ఇచ్చే సూచన ఏంటి? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.