Vizag Srujana Case: విశాఖ వధువు ఆత్మహత్య కేసు మిస్టరీ వీడింది. ఆమె ఆత్మహత్యకు గల అసలు కారణాలు తేటతెల్లం అయ్యాయి. సృజన ఆత్మహత్య చేసుకోవటానికి ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు తేల్చారు. ఆమె ఫోన్ కాల్ డేటా, చాటింగ్ హిస్టరీ ఆధారంగా ఈ విషయాలు వెలుగు చూశాయి. సృజన పరవాడకు చెందిన తోకాడ మోహన్‌తో ఏడేళ్లుగా ప్రేమలో ఉంది. ఈ నేపథ్యంలోనే తల్లిదండ్రులు ఆమెకు దగ్గరి బంధువైన ఓ వ్యక్తితో పెళ్లి నిశ్చయిం చేశారు. పెళ్లి ఇష్టం లేని ఆమె ప్రియుడ్ని పెళ్లి చేసుకోమని అడిగింది. కానీ, అతడు తనకు ఉద్యోగం లేదని, ఇప్పుడే పెళ్లి చేసుకోనని చెప్పాడు. రోజులు గిర్రున గడిచాయి. పెళ్లికి ఇంక రెండు రోజులు మాత్రమే ఉన్నాయి.
సృజనలో భయం పెరిగిపోయింది. మోహన్‌తో.. తనకు ఆ పెళ్లి ఏ మాత్రం ఇష్టం లేదని, అక్కడినుంచి తీసుకెళ్లి పొమ్మని కోరింది. మోహన్ మాత్రం పాత పాటే పాడాడు. తనకు ఉద్యోగం లేదని, రెండేళ్లు టైం కావాలన్నాడు. ప్రియుడు టైం కావాలని అడగటంతో సృజన ఆలోచనల్లో పడింది. పెళ్లి ఆపుచేస్తే అన్ని సమస్యలు తీరతాయని అనుకుంది. తల్లిదండ్రులను భయపెట్టి, పెళ్లి వద్దని పించటానికి ఓ పథకం వేసింది. పెళ్లి రోజు విష పదార్థం తీసుకుంది. అయితే, దాని వల్ల తాను చనిపోతానని ఆమె ఊహించలేదు. కానీ, ఊహించనిదే జరిగింది. విషం ప్రభావం కారణంగా పెళ్లి పీటల మీదే స్ప్రహ తప్పిపడిపోయింది. ఆ తర్వాత మృతి చెందింది.ఇక్కడ సృజన మృతికి ప్రత్యక్ష కారణం విషం.. మరి పరోక్ష కారణాలు ఏంటి?.. పెళ్లిని ఆపటానికి ఆత్మహత్య డ్రామా ఆడాలనుకున్న ఆమె అమాయకత్వమా?.. విష పదార్థం తింటే ప్రాణాలకు ప్రమాదం అని ఆమెకు తెలియదా?.. లేక తెలిసినా కూడా పెళ్లిని ఆపాలన్న తొందరలో ఆ నిర్ణయం తీసుకుందా?.. అసలు పెళ్లిని ఆపటానికి అదొక్కటే మార్గమని ఆమె ఎలా అనుకుంది?.. తల్లిదండ్రుల వైపునుంచి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయోచ్చుగా.. ఒక వేళ ఆ ప్రయత్నం చేసినా వాళ్లు ఆమె మాట వినలేదా?.. బహుశా సృజన మాటలను వారు వినకపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఏ తల్లిదండ్రులైనా తమ బిడ్డల బాగునే కోరుకుంటారు. తెలిసీ తెలియని వయసులో గురయ్యే ఆకర్షణలు.. తీసుకునే తొందరపాటు నిర్ణయాలు తమ బిడ్డల జీవితాల్ని నాశనం చేస్తాయేమోనన్న భయంతో వాళ్లు ఆలోచిస్తారు.
కాబట్టి, ప్రేమ పెళ్లి అనగానే పక్కలో బాంబు పడ్డట్టు అవుతారు. కానీ, తమ బిడ్డ ప్రాణాలే పోతాయని తెలుసుంటే సృజన తల్లిదండ్రులు ఆలోచించేవారేమో.. పెళ్లిని వాయిదా వేసేవారేమో.. ఇక సృజన ప్రియుడు మోహన్ విషయానికి వస్తే.. పెళ్లికి రెండు రోజులు పెట్టుకుని అతడామెను రెండేళ్లు ఆగమని అనటం ఎంతవరకు న్యాయం?.. ప్రేమించిన మనిషి కోసం ధైర్యం ఎందుకు చేయలేకపోయాడు?…. ఏదైతేనేం నిండు నూరేళ్లు సంతోషంగా బ్రతికాల్సిన ఓ జీవితం అర్థాంతరంగా ముగిసింది. మరి, ఈ మొత్తం స్టోరీలో తప్పెవరిదని మీరనుకుంటున్నారు?.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : MLC Anantha Babu: నేరం ఒప్పుకున్న వైసీపీ MLC అనంతబాబు! హత్యకి కారణం?