రెండు రోజుల క్రితం వైజాగ్ ఆర్కే బీచ్ లో కనిపించకుండా పోయిన వివాహిత కేసులో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. బీచ్ నుంచి కనిపించకుండా పోయిన సాయి ప్రియ.. ఇవాళ ఉదయం నెల్లూరులో ప్రత్యక్షం అయింది. అక్కడే ఉంటే గాలిస్తారు అనుకున్న యువతి, ఆమె ప్రియుడు అక్కడి నుండి బెంగుళూరుకు మకాం మార్చారు. అక్కడే ఇద్దరు పెళ్లి చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఈ మేరకు పెళ్లి ఫోటోలను తల్లిదండ్రులకు పంపినట్లు తెలుస్తోంది.
బెంగుళూరులో ప్రియుడిని పెళ్లి చేసుకున్న సాయిప్రియ తాలిబొట్టుతో ఉన్న పెళ్లి ఫోటోలను తల్లిదండ్రులకు పంపిదన్నది సారాంశం. తాను క్షేమంగా ఉన్నానంటూ, తన కోసం వెతకద్దంటూ వాట్సాప్ మెస్సేజులు పంపింది. ప్రియుడి(రవి) తల్లిదండ్రులను కూడా ఏమీ చేయొద్దని కోరింది. భర్త ఫిర్యాదుతో సాయిప్రియపై కేసు నమోదు చేశారు పోలీసులు. కాగా, సాయిప్రియ నెల్లూరుకు చెందిన రవితో కొన్నాళ్లుగా ప్రేమ వ్యవహారం నడుపుతోందని తెలుస్తోంది. పెళ్లి రోజు సందర్భంగా భర్తతో ఆర్కే బీచ్ కు వెళ్లిన క్రమంలో భర్త మొబైల్ చూస్తున్న సమయంలో సాయిప్రియ లవర్ తో పారిపోయినట్టు నిర్ధారణకు వచ్చారు.
కాగా, సాయిప్రియకు శ్రీనివాస్ అనే వ్యక్తితో రెండేళ్ల క్రితం వివాహమైంది. శ్రీనివాస్ హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఎన్ఏడీ వద్ద ఓ కాలేజీలో సాయిప్రియ డిగ్రీ సెకండియర్ చదువుతోంది. ఈనెల 25న తమ పెళ్లిరోజు కావడంతో భర్త శ్రీనివాస్, ఆయన భార్య సాయిప్రియ కలిసి విశాఖలోని ఆర్కే బీచ్ కు వెళ్లారు. సాయంత్రం 6 గంటల వరకు బీచ్ ఒడ్డున భార్యాభర్తలు కలిసి ఉన్నారు. అయితే సాయి ప్రియ భర్తకు ఫోన్ లో మెసేజ్ రావడంతో ఒడ్డు నుంచి వెనక్కి వచ్చి మెసేజ్ చూసుకుని తిరిగి చూసేసరికి సాయి ప్రియ కనబడలేదు. దీంతో తన భార్య సముద్రంలోని కొట్టుకుపోయిందని భావించిన ఆమె భర్త శ్రీనివాస్.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.. ఆరోజే గత ఈతగాళ్ల సాయంతో బీచ్ లో గాలించగా ఆచూకీ లభ్యం కాలేదు. ఇక, ఆ తర్వాత నేవీ హెలికాప్టర్ కూడా రంగంలోకి దిగింది.. కానీ, సాయిప్రియ మాత్రం.. నెల్లూరు, బెంగుళూరు అంటూ.. ప్రియుడితో చక్కర్లు కొడుతోంది.
ఇదీ చదవండి: 2 రోజులుగా RK బీచ్ లో నేవీ హెలికాప్టర్లతో గాలింపు! ఆమె మాత్రం నెల్లూరులో ప్రియుడితో!
ఇదీ చదవండి: RK బీచ్ యువతి మిస్సింగ్ కేసుపై స్పందించిన విశాఖ డిప్యూటీ మేయర్!