ఈ రోజుల్లో చాలా మంది మహిళలు భర్త ఉండగా పరాయి మగాడి మోజులో పడిపోతున్నారు. కొందరైతే పెళ్లికి ముందే ప్రేమ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. ఇక అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టని వివాహితలు పెళ్లి అనంతరం కూడా ప్రియుడితో సీక్రెట్ గా మీటింగులు, చాటింగులతో గడిపేస్తున్నారు. చివరికి భార్య చీకటి కాపురం బయటపడడంతో హత్యలు చేయడం, లేదంటే ఆత్మహత్యలు చేసుకోవడం చేస్తున్నారు. సరిగ్గా ఇలాగే బరితెగించిన ఓ పెళ్లైన మహిళ చివరికి ప్రాణాలతో లేకుండా పోయింది. అసలు ఏం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అది విశాఖపట్నం కసింకోట మండలం గోనివానిపాలెం. హేమలత, శ్రీనివాస రావు అనే వీళ్లిద్దరికి డిగ్రీ చదువుకునే రోజుల్లో పరిచయం ఉంది. ఈ పరిచయం స్నేహం నుంచి చివరికి ప్రేమగా మారింది. ఈ లవర్స్ కొన్ని రోజుల పాటు పీకల్లోతు ప్రేమలో మునిగి తేలారు. ఈ క్రమంలోనే హేమలతను మరో యువకుడికి ఇచ్చి ఆమె తల్లిదండ్రులు వివాహం జరిపించారు. అలా రోజుల నుంచి సంవత్సరాలు గడిచాయి. కానీ శ్రీనివాసరావు, హేమలతల ప్రేమ మాత్రం చెక్కు చెదరలేదు. దీంతో వీలు కుదిరినప్పుడల్లా సీక్రెట్ గా చాటింగులు, మీటింగులు చేసుకుంటున్నారు. ఈ విషయం రాను రాను భర్తతో పాటు హేమలత తల్లిదండ్రుల చెవిన పడింది.
ఈ విషయం భర్తకు తెలిసిందని హేమలత తట్టుకోలేకపోయింది. తీవ్ర మనస్థాపానికి లోనైన ఆ మహిళ ఇటీవల ప్రియుడిని కలిసింది. ఇక్కడే ఈ ప్రేమికులు ఓ కఠినమైన నిర్ణయాన్నితీసుకున్నారు. కలిసి బతకలేకున్నా, కలిసి చనిపోవాలనుకున్నారు. ఇందులో భాగంగానే హేమలత, శ్రీనివాసరావు స్థానికంగా ఉన్న ఓ చెరువులో దూకి ఆత్యహత్య చేసుకున్నారు. అయితే గత రెండు రోజుల నుంచి హేమలత కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే చెరువులో హేమలత శవం దొరికిందని పోలీసులకు సమచారం అందింది. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించగా హేమలత, శ్రీనివాసరావు ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారని తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న హేమలత, శ్రీనివాసరావు తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.