విశాఖ ఆర్కే బీచ్ లో గల్లంతైన సాయి ప్రియ అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. అయితే సాయి ప్రియ గల్లంతైందని తెలుసుకున్న అక్కడి పోలీసులు హుటాహుటిన నేవి కోస్ట్ గార్డ్ షిప్ లతో పాటు ఓ హెలికాప్టర్, గజ ఈతగాళ్లలను రంగంలోకి దింపి సాయిప్రియ ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గత రెండు రోజుల నుంచి తీవ్రంగా శ్రమిస్తున్న కూడా ఆమె ఆచూకి దొరకకపోవడంతో ఆమె భర్త, వివాహిత తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు.
దీంతో పాటు ఆమె క్షేమంగా రావాలని ప్రతి ఒక్కరు కూడా ఆ దేవుడిని వేడుకున్నారు. ఇలా ఎంతో శ్రమించి ఆమె ఆచూకి కోసం గాలిస్తుంటే ఆమె మాత్రం ప్రియుడితో నెల్లూరులో ప్రత్యక్షమవ్వడం అందరినీ షాక్ కు గురి చేస్తోంది. నేవీ కోస్ట్ అధికారులు, పోలీసులు, గజ ఈతగాళ్లు ఇలా ఎంతో మంది సాయి ప్రియ ఆచూకి కోసం వారి విలువైన సమయాన్ని కేటాయించి వెతుకుతుంటే ఆమె మాత్రం ప్రియుడి వద్దకు వెళ్లింది. సాయి ప్రియ ఆచూకి కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఇంత చర్చ జరుగుతుంటే కనీసం నోరు విప్పకుండా ప్రియుడితో ఉండడం అనే ఆమె చర్యపై నెటిజన్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. అందరినీ ఇంత మోసం చేస్తావా? అంటూ ఆగ్రహంతో ఊగిపోతున్నారు.
ఇది కూడా చదవండి: RK బీచ్‌లో వివాహిత మిస్సింగ్ కేసులో ట్విస్ట్..! ప్రియుడితో నెల్లూరులో ప్రత్యక్షం!
విషయం ఏంటంటే? ఈ నెల 25న సాయి ప్రియ పెళ్లి రోజు కావడంతో భర్తతో పాటు విశాఖలోని ఆర్కే బీచ్ కు వెళ్లింది. ఉన్నట్టుండి అక్కడి నుంచి కనిపించకుండా పోవడంతో భర్త వెంటనే నా భార్య గల్లంతు అయిందని బీచ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇలా ఎంతో మంది వారి విలువైన సమయాన్ని వృధా చేసి మోసం చేసిన సాయి ప్రియ తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.