విశాఖ ఆర్క్ బీచ్ లో గల్లంతైన సాయి ప్రియ ఘటనలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. అయితే సాయి ప్రియ ఇటీవల పెళ్లి రోజు కావడంతో భర్తతో పాటు బీచ్ కు వెళ్లింది. ఉన్నట్టుండి సాయి ప్రియ కనిపించకపోవడంతో భర్త బీచ్ బీచ్ లో గల్లంతు అయిందని భర్త బీచ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు రెండు నేవి కోస్ట్ గార్డ్ షిప్ లతో పాటు ఓ హెలికాప్టర్ సాయంతో సాయిప్రియ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
గత మూడు రోజలు నుంచి తీవ్రంగా గాలిస్తున్న పోలీసులకు సాయి ప్రియ ఆచూకి ఏ మాత్రం దోరకలేదు. ఇక పెళ్లి రోజున భర్తతో పాటు సరదాగ గడిపేందుకు వస్తే ఇలా జరగడంతో సాయి ప్రియ తల్లిదండ్రులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. సోమవారం నుంచి గాలిస్తున్న సాయి ప్రియ ఆచూకి దొరకకపోవడంతో నేవీ అధికారులు, పోలీసులు, గల ఈతగాళ్లు సైతం రంగలోకి దిగి తీవ్రంగా శ్రమించారు. అయితే ఈ క్రమంలోనే సాయి ప్రియ ప్రియుడితో నెల్లూరులో కనిపించడంతో భర్త, పోలీసులు ఒక్కసారిగా షాక్ కు గురవుతున్నారు.
ఇది కూడా చదవండి: విశాఖ యువతి గల్లంతు కేసులో షాకింగ్ ట్విస్ట్! సముద్రంలో ఎవరైనా తోసేశారా?
ఇదిలా ఉంటే.. సాయి ప్రియ నెల్లూరుకు చెందిన రవి అనే వ్యక్తితో ఎప్పటి నుంచో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. భర్తను నమ్మించి బీచ్ కు తీసుకెళ్లిన ఈ వివాహిత.. భర్త ఫోన్ చూస్తున్న క్రమంలో అతని కళ్లు గప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయి.., నెల్లూరులో ప్రియుడితో ప్రత్యక్షమైందని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనతో గత రెండు మూడు రోజులు నుండి బీచ్ లో శ్రమిస్తున్న పోలీసులు, నేవీ కోస్ట్ గార్డ్ అధికారులకు సాయి ప్రియ ప్రియుడితో కనిపించడంతో అధికారులు ఒక్కసారిగా షాక్ కు గురవుతున్నారు. మరో దారుణమైన విషయం ఏంటంటే? సాయి ప్రియ గల్లంతు అయిందని ఎంతో మంది బీచ్ లో ఆమె ఆచూకి కోసం తీవ్రంగా గాలిస్తుంటే, ఆమె మాత్రం నోరువిప్పకుండా ప్రియుడితో నెల్లూరు ఆనందంగా ఉండటం అందరికీ దిమ్మతిరిగేలా చేసింది. ఇలా ఇంతటి దారుణ చర్యకు పాల్పడిన సాయి ప్రియ తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.