ఆమె పేరు సాయిప్రియ. ఓ వ్యక్తితో వివాహం జరిగింది. అయితే ఇటీవల వీరి పెళ్లిరోజు కావడంతో సరదాగ గడిపేందుకు భార్యాభర్తలిద్దరూ ఓ బీచ్ కు వెళ్లారు. సరదా సరదా ముచ్చట్లు మాట్లాడుకుని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే తిరిగి ఇంటికి వెళ్దామని అనుకుంటున్న తరుణంలోనే ఉన్నట్టుండి ప్రమాదవశాత్తు ఆ మహిళ బీచ్ లో గల్లంతైంది. తాజాగా విశాఖ ఆర్కే బీచ్ లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
అయితే దీనిపై స్పందించిన అక్కడి అధికారులు వెంటనే రెండు నేవి కోస్ట్ గార్డ్ షిప్ లతో పాటు ఓ హెలికాప్టర్ సాయంతో సాయిప్రియ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. దీనిపై సాయి ప్రియ భర్త స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె ఆచూకి కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇదిలా ఉంటే పెళ్లి రోజు భార్యతో పాటు సరదాగ గడిపేందుకు వస్తే ఇలా జరగడంతో భర్తతో పాటు ఆమె బంధువులు కంటతడి పెడుతున్నారు. పెళ్లి రోజున నాడే ఇలాంటి ప్రమాదం సంభవించడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాయి ప్రియ గల్లంతు అవ్వడంతో స్థానికంగా తీవ్రచర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: మహిళా ఎస్ఐని చెప్పుతో కొట్టిన అక్కాచెల్లెళ్లు! అసలు కారణం ఏమిటంటే..