డబ్బు మనిషిని ఎంతకైనా తెగించేలా చేస్తుంది. కొందరు అయితే కన్నవాళ్లను, తోడబుట్టినవాళ్లను, కట్టుకున్న వాళ్లను ఇలా.. ఎవరిని లెక్క చేయకుండా చివరికి హత్యలు చేయడానికి కూడా వెనకాడడం లేదు. ఇలాంటి హత్యలు దేశంలో రోజుకొక చోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. అచ్చం ఇలాగే ఓ భర్త డబ్బుకు ఆశపడి కట్టుకున్న భార్య అని కూడా చూడకుండా ఎవరూ ఊహించని దారుణానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతుంది. డబ్బుకు ఆశపడి భర్త ఏం చేశాడు? అసలు ఈ ఘటనలో ఏం జరిగిందనే పూర్తి వివరాలు మీ కోసం.
ఓ వెబ్ సైట్ కథనం ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన గిరి ప్రసాద్ కి, హైదరాబాద్ కు చెందిన సౌజన్య (26)తో 8 నెలల కిందట వివాహం జరిగింది. ఇక పెళ్లి తంతులో భాగంగా అమ్మాయి తల్లిదండ్రులు గిరి ప్రసాద్ కు కట్న, కానుకలు బాగానే ముట్టజెప్పారు. అయితే సౌజన్య ప్రముఖ ఐటీ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా చేస్తుండగా, భర్త మాత్రం ఓ ఆస్పత్రిలో దంత వైద్యుడిగా చేస్తున్నాడు. ఇలా భార్యాభర్తలు మంచి హోదాల్లో స్థిరపడి సంసారాన్ని ఈడ్చకుంటూ వస్తున్నారు. పెళ్లైన కొంత కాలం వరకు ఈ దంపతులు ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగా జీవిస్తున్నారు. ఇకపోతే ఈ దంపతులు మూడు నెలల కిందట విశాఖలోని దువ్వుపాలెంలో ఇళ్లు కొనుకుని ఇక్కడే ఉంటున్నారు. అయితే రాను రాను భర్త గిరి ప్రసాద్ భార్యను వేధింపులకు గురి చేశాడు.
అదనపు కట్నం తేవాలంటూ రోజూ టార్చర్ చేసేవాడు. భర్త వేధింపులు రోజు రోజుకు శృతిమించడంతో సౌజన్య రోజూ ఏడుస్తూ ఉండేది. ఇదిలా ఉంటే శనివారం భర్త గిరి ప్రసాద్ అతిగా మద్యం సేవించి ఇంటికొచ్చాడు. డబ్బుల కోసం కక్కుర్తిపడ్డ భర్త అదనపు కట్నం తేవాలంటూ భార్యకి మళ్లీ వార్నింగ్ ఇచ్చాడు. ఆమెపై దారుణంగా దూషించాడు. ఇక భర్త టార్చర్ ను భరించలేకపోయిన భార్య సౌజన్య ఊహించని నిర్ణయం తీసుకుంది. ఇలాంటి బతుకు నాకు వద్దు అనుకుందో ఏమో తెలియదు కానీ, అదే రోజు సౌజన్య ఇంట్లో ఫానుకు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఇక భర్త సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా.. భార్య ఉరికి వేలాడుతూ కనిపించింది.
ఈ సీన్ చూసిన భర్త ఒక్కసారిగా షాక్ గురయ్యాడు. వెంటనే ఇదే విషయాన్ని అత్తమామలకు తెలియజేశాడు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న సౌజన్య తల్లిదండ్రులు.. కూతురుని అలా చూసి తట్టుకోలేకపోయారు. గుండెలు పగిలేలా ఏడుస్తూ చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త వరకట్న వేధింపుల కారణంగానే మా కూతురు ఆత్మహత్య చేసుకుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా కలకలంగా మారుతుంది. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.