ఏపీలో దారుణం చోటు చేసుకుంది. ఓ తండ్రి తన కూతురిపై గత కొంత కాలంగా బలవంతంగా అత్యాచారం చేస్తూ వచ్చాడు. దీంతో చివరికి ఆ బాలిక గర్భం దాల్చింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారుతోంది.
నాన్నంటే భరోసా, నాన్నంటే కొండత ధైర్యం. బిడ్డను ఉన్నత స్థాయికి తీసుకుపోవడానికి తండ్రి సర్వం ధారపోస్తాడు. తండ్రి పస్తులుండైనా సరే తన బిడ్డలకు పెట్టాలనుకుంటాడు. అలాంటి తండ్రే.. చివరికి కూతురిని గర్భవతి చేశాడు. వినటానికి భయంకరంగా ఉన్న ఈ వార్త నిజం. తాజాగా ఏపీలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారుతోంది. పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని విశాఖపట్నం జిల్లా గాజువాక మండలం గంగవరం గ్రామం. ఇక్కడే ఓ బాలిక స్థానికంగా 10వ తరగతి చదువుతూ తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటుంది.
అయితే ఆ బాలిక తండ్రి తాగుడుకు బానిసై జులాయిగా తిరుగుతుండేవాడు. ఇక రాను రాను ఆ దుర్మార్గపు తండ్రి తన కూతురిపై కన్నేశాడు. తరుచు లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. అంతేకాకుండా తాగిన మత్తులో అనేక సార్లు కూతురిపై అత్యాచారం కూడా చేశాడు. అయితే ఇటీవల ఆ బాలిక ఆరోగ్య పరిస్థితి బాగ లేకపోవడంతో ఆస్పత్రికి వెళ్లింది. పరీక్షించిన వైద్యులకు ఆ బాలిక గర్భం దాల్చిందని తెలిసింది. ఇదే విషయం చివరికి పోలీసుల వరకు వెళ్లింది. వెంటనే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా సంచలనంగా మారుతోంది. కన్న కూతురిని గర్భవతిని చేసిన దుర్మార్గపు తండ్రి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.