ఆమె పేరు రొడ్డా భవాని. రాజమహేంద్రవారిని చెందిన ఈ వివాహిత కోనసీమ జిల్లా చల్లపల్లి పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తస్తోంది. అయితే భవాని పదేళ్ల కిందట వెంకటేశ్వరరావు అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని కొంత కాలానికి ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో పిల్లా పాపలతో వీరి కాపురం సంతోషంగానే సాగింది. భవాని తన ఉద్యోగంలో కూడా మంచి పేరును సంపాదిస్తూ అధికారుల దృష్టిని సైతం ఆకర్షించింది. ఈ నేపథ్యంలోనే భవాని మూడు నెలల కిందట నిర్వహించాల్సిన పంచాయతీ పాలక వర్గ సమావేశాన్ని గడుపు దాటిన తర్వాత నిర్వహించింది.
దీంతో అప్పటి నుంచి కన్నెర్ర జేసిన అధికారులు ఆ ఉద్యోగినిని వేధించడం మొదలు పెట్టారు. ఇంతటితో ఆగకుండా ఓ వర్గం వారు పంచాయతీ పాలకవర్గ సమావేశాన్ని సరైన సమయానికి నిర్వహించలేదని ఏకంగా జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఇక ఇదే విషయంపై స్థానిక అధికారులు, అధికార పార్టీ నేతలు భవానిని తీవ్రంగా వేధించేవారట. కలెక్టర్ కు ఇచ్చిన ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలంటే డబ్బులు ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Karimnagar: ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు.. యువతి ఎవరూ లేని టైమ్ చూసి!
ఇక వేధింపులన్నిటినీ భవాని సహించలేకపోయింది. తీవ్ర మనస్థాపానికి గురైంది. ఎవరికి చెప్పుకోవాలో తెలియక తనలో తాను కుమిలిపోతూ గురువారం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్న భవాని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ అధికార నేతలపై, పై అధికారులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మా అమ్మాయి మరణానికి అధికార పార్టీ నేతల వేధింపులే కారణమని, మాకు న్యాయం చేయాల్సిందేనంటూ ఆమె బంధువులు డిమాండ్ చేశారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.