కాలేజీ రోజుల్లో యువతి ఓ యువకుడితో ప్రేమ వ్యవహారం నడిపింది. కొన్నాళ్లకి తల్లిదండ్రులు మరో యువకుడికి ఇచ్చి వివాహం చేశారు. కానీ ప్రేమించిన వాడిని మాత్రం ఆ యువతి మరిచిపోలేదు. అలా కొన్నాళ్ల పాటు భర్తతో సంసారం చేస్తూనే తన భాయ్ ఫ్రెండ్ తో సీక్రెట్ ఛాటింగ్, మీటింగ్ లు జరిపింది. ఈ విషయం భర్తకు తెలియడంతో తన లవర్ తో భార్య సంచలన నిర్ణయం తీసుకుంది. అసలేంటి తన భార్య తీసుకున్న ఆ నిర్ణయం అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది విశాఖపట్నం జిల్లా కశింకోట మండలం గోకివానిపాలెం గ్రామం. హేమలత, శ్రీనివాసరావు అనే ఇద్దరూ 2017 లో ఒకే కాలేజీలో చదువుకునేవారు. వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త రాను రాను ప్రేమగా మారింది. అలా కొన్ని రోజులు గడిచింది. దీంతో కొంతకాలానికి హేమలతకు తల్లిదండ్రులు వివాహం చేశారు. కానీ ప్రేమించిన ప్రియుడు శ్రీనివాస్ ను మాత్రం హేమలత మరిచిపోలేకపోయింది.
ఇది కూడా చదవండి: లేచిపోయి పెళ్లి చేసుకున్నారు! కొన్నాళ్లకే భార్యను సజీవదహనం చేసిన భర్త!అలా భర్తకు తెలియకుండా లవర్ తో సీక్రెట్ గా ఫోన్లో మాట్లాడుతూ అప్పుడప్పుడు బయట కలుసుకునేవారు. ఈ విషయం ఇటీవల భర్తతో పాటు హేమలత తండ్రికి తెలిసింది. ఏదో తెలియక చేసిందని హేమలత తండ్రి అల్లుడికి నచ్చజెప్పాడు. తన తండ్రికి, భర్తకు తెలిసిందని హేమలత తట్టుకోలేకపోయింది. దీంతో శ్రీనివాసరావు, హేమలత ఇద్దరూ కలిసి ఇటీవల బైక్ పై వెళ్లి స్థానికంగా ఉండే చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.
ఈ విషయం తెలుకుని హేమలత, శ్రీనివాస్ కుటింభికులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇక ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.