తమను ఒక పోలీస్ కానిస్టేబుల్ బుతులు తిట్టాడాని ఆరోపిస్తూ ఇద్దరు మహిళలు రోడ్డుపై నిరసన తెలిపారు. బండిపై వెళ్తున్న తమను ఆపి బుతులు తిట్టినట్లు వారు తెలిపారు. అక్కడికి పోలీసుల అధికారులు చేరుకుని వారికి నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు. ఆ కానిస్టేబుల్ వచ్చి తమకు క్షమాపణ చెప్పాలని, అతనిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందనే విషయాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. కాగా మహిళలందరూ ఇలా ఏకమై పోలీసులను నిలదీసిన తీరుపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి.