ఈ రోజుల్లో ఆస్తుల కోసం కొందరు ఎంతకైనా తెగిస్తున్నారు. చివరికి అడ్డొచ్చిన కుటుంబ సభ్యులను సైతం అంతమొందించడానికి కూడా వెనకాడడం లేదు. గతంలో ఇలాంటి ఘటనల మనం చాలానే చూశాం. ఇదిలా ఉంటే తాజాగా ఓ తండ్రి మాత్రం ఆస్థిని దక్కించుకునేందుకు ఎదురొచ్చిన కన్న కొడుకును దారుణంగా కొట్టి చంపాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఈ హత్యకు ఆస్తి గొడవలే కారణమా? లేదా మరేదైనా కారణం ఉందా అనే పూర్తి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
అది తెలంగాణలోని వికారాబాద్ జిల్లా పెద్దముల్ మండలం ఇందూరు గ్రామం. ఇక్కడే జానిమియా అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతను గతంలో రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. అయితే రెండవ భార్యకు ఓ కుమారుడు గోరేమియా అనే కుమారుడు జన్మించాడు. ఇతను హైదరాబాద్ లో ఉంటూ పౌల్ట్రీ ఫామ్ లో పని చేస్తూ జీవినాన్ని కొనసాగిస్తున్నాడు. ఇదిలా ఉంటే గత కొన్ని రోజుల నుంచి వీరి కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే బుధవారం రోజు కూడా జానిమియా రెండవ భార్య కుమారుడితో గొడవ పడ్డాడు. ఈ గొడవ చినిగి చివరికి తండ్రీ కొడుకు కొట్టుకునే స్థాయికి చేరుకుంది.
దీంతో జానిమియా కోపం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. క్షణికావేశంలో తండ్రి ఇంట్లో ఉన్న కర్రతో కుమారుడి తలపై బలంగ దాడి చేశాడు. ఈ దాడిలో కుమారుడు గోరేమియా రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఇక కుమారుడు మరణించాడని తెలుసుకున్న తండ్రి అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం ఈఘటన విషయం చివరికి పోలీసుల వరకు వెళ్లడంతో కేసు నమోదు చేసుకున్నారు. అయితే కుమారుడి హత్యపై స్పందించిన తండ్రి… నేనే చంపానని తొందర్లోనే పోలీసుల ఎదుట లొంగిపోతానని తెలిపాడు. మరో షాకింగ్ విషయం ఏంటంటే? గోరేమియా హత్య కేసులో జానిమియా మొదటి భార్య హస్తం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.