వివాహేతర సంబంధాలు.. ఇవే పచ్చగా సాగుతున్నకాపురాల్లో నిప్పును రాజేస్తున్నాయి. భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త. ఇలా ఎవరికి వారు వివాహేతర సంబంధాల్లో తలదూర్చుతూ నిండు సంసారాలను చేజేతుల్లా నాశనం చేసుకుంటున్నారు. ఇవి బయటపడడంతో హత్యలు చేయడం లేదంటే హత్యకు గురయ్యే ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఇలాంటి వివాహేతర సంబంధాల్లోనే సొంత అన్నను చంపాడో తమ్ముడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది వికారాబాద్ జిల్లా బొంరాస్‌పేట మండలంలోని ఏర్పుమల్ల గ్రామం. ఇదే ప్రాంతంలో పూజారి గోపాల్, పూజారి శ్రీను అనే అన్నదమ్ములు నివాసం ఉంటున్నారు. అయితే పూజారి శ్రీను భార్యతో తన అన్నకు వివాహేతర సంబంధం ఉందని ఎప్పటి నుంచో అనుమానంతో ఉన్నాడు. అప్పుడప్పుడు తన భార్యని కూడా ఓ కంట కనిపెట్టడంతో వీరిద్దరి మధ్య సంబంధం ఉందనే అనుమానం మరింత బలపడింది.
ఇది కూడా చదవండి: Vijayawada: పసి పిల్లలకు బతికుండగానే నరకం చూపించిన తండ్రి.. ఇల్లు వదిలి బయటకొచ్చిన చిన్నారులు!
ఇక తన భార్యతో అన్న సాగించే వ్యవహారాన్ని చూసి తమ్ముడు పూజారి శ్రీను తట్టుకోలేకపోయాడు. ఎలాగైన తన అన్న అయిన పూజారి గోపాల్ ని హత్య చేయాలనే పథకం రచించాడు. ఇక ఇందులో భాగంగానే గత ఏడాది నవంబర్ 15న శ్రీను గోపాల్ గొంతును టవాల్‌తో బిగించి చంపాడు. ఎవరికి కూడా అనుమానం రాకుండా మృతదేహాన్ని ఊరు చివర ఉన్న దోసలకుంటలో పడేశాడు.
కాగా రెండు రోజుల తర్వాత ఆ శవం పైకి తేలడంతో మృతుని తండ్రి స్థానిక పోలీసులు ఫిర్యాదు చేశాడు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇన్ని రోజుల పాటు విచారించారు. ఇక ఎట్టకేలకు పూజారి గోపాల్ ను సొంత తమ్ముడైన పూజారి శ్రీను హత్య చేసినట్లు నేరం రుజువైంది. దీంతో శ్రీనును అరెస్ట్ చేసిన పోలీసులు శనివారం రిమండ్ తరలించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ నిజం గ్రామంలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.