వీరికి పెళ్లై చాలా ఏళ్లే అవుతుంది. కష్టాన్ని నమ్ముకుని ఉన్నాళ్లు తిని, లేనాళ్లు పస్తులున్నారు. జీవితంలో గొప్పగా స్థిరపడాలన్న కోరిక లేదు, ఆస్తులు పొగు చేయాలన్న ఆశ అంతకన్నా లేదు. ఇలా ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా ఆనందంగా బతికిన ఈ దంపతులు ఒక్కసారిగా ఈ లోకాన్ని విడిచి కన్న పిల్లలకు శోకాన్ని మిగిల్చి వెళ్లిపోయారు. తాజాగా వికారాబాద్ లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం మంతట్టి. ఇదే గ్రామంలో బుగ్గప్ప (50), యాదమ్మ (45) అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. మంతట్టి గ్రామ శివారులోని కాగ్నా నది పరివాహక ప్రాంతంలో వీరికి కొంత పొలం ఉంది. దీంతో ప్రతి రోజూ ఉదయం పొలానికి వెళ్లి పనులు చేసుకుని సాయంత్రం తిరిగి ఇంటికొచ్చేవాళ్లు. అలా చాలా ఏళ్లు ఎన్నో రకాల పంటలు పండిస్తూ స్థానికంగా విక్రయిస్తూ జీవనాన్ని కొనసాగించేవారు. అయితే గత బుధవారం ఈ దంపతులు పొలంలో కూరగాయలు విక్రియించి రాత్రికి తమ బంధువుల ఇంట్లో ఉండి ఉదయం తిరిగొస్తామని కుమారుడికి చెప్పి వెళ్లారు.
అలా కూరగాయలు అమ్ముకుని వస్తూ కాగ్నా నది దాటుతుండగా వరదలో పడి కొట్టుకుపోయారు. ఇక సోమవారం అయినా తల్లిదండ్రులు ఇంటికి రాకపోవంతో కుమారుడు అటు ఇటు అంతా వెతికాడు. బంధువుల ఇంటికి కూడా ఫోన్ చేసి వారి సమాచారాన్ని తెలుసుకున్నాడు. ఇక ఎంత వెతికినా కూడా తల్లిదండ్రుల ఆచూకి మాత్రం దొరకలేదు. అయితే ఈ బుధవారం ఈ దంపతుల మృతదేహాల ఫోటోలలను కొందరు స్థానికులు కుమారుడికి పంపారు. ఈ విషయం తెలుసుకున్న కుమారుడు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని తల్లిదండ్రుల మృతదేహాలను చూసి ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు.
రెండు రోజుల్లో తిరిగి వస్తానని చెప్పి వెళ్లిన తల్లిదండ్రులు ఒక్కసారిగా కానరాని లోకాలకు వెళ్లడంతో కుమారుడు కన్నీటి సంద్రంలో మునిగిపోయాడు. తాజాగా వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ విషాద ఘటన స్థానికుల కంట కన్నీరు తెప్పిస్తుంది. ఈ దంపతుల మరణంపై స్పాందించిన గ్రామస్తులు పాపం.. ఇలాంటి చావు ఎవరికీ రాకూదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ దంపతుల మరణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.