విద్యా బుద్దులు నేర్పించాల్సిన కొందరు ఉపాధ్యాయులు అడ్డగొలుగా ప్రవర్తిస్తున్నారు. స్కూల్ కు మద్యం సేవించి వస్తున్నారు. అంతే కాకుండా అసభ్యకరంగా ప్రవర్తిస్తూ చివరికి విద్యార్థులను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారు. సరిగ్గా ఏపీలో ఇలాగే వ్యవహరించిన ఓ ఉపాధ్యాయుడికి అధికారులు ఊహించని షాక్ ఇచ్చారు. అసలేం జరిగిందంటే?
ఈ మధ్యకాలంలో కొందరు టీచర్లు బరితెగించి ప్రవర్తిస్తూ ఉపాధ్యాయ వృత్తికే మచ్చ తెస్తున్నారు. విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. అంతే కాకుండా లైంగిక వేధింపులకు పాల్పడుతూ చివరికి స్పెషల్ క్లాస్ ల పేరుతో అత్యాచారాలకు తెగబడుతున్నారు. ఇలాంటి ఘటనలు గతంలోనే చాలానే జరిగాయి. ఇదిలా ఉంటే తాజాగా ఏపీలోని ఓ ప్రభుత్వ పాఠశాలోని ఓ ఉపాధ్యాయుడు మద్యం సేవించి స్కూల్ లో విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో వెంటనే స్పందించిన అధికారులు అతడికి ఊహించని షాక్ ఇచ్చారు. అసలేం జరిగిందంటే?
విజయవాడ జక్కంపూడి షాబాదలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో కట్టారం సాయి అనే వ్యక్తి హెడ్ మాస్టార్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఈ స్కూల్ లో చదువుకోవడానికి స్థానికంగా ఉండే ఎంతో మంది పిల్లలు వస్తున్నారు. ఇకపోతే హెడ్ మాస్టార్ గా పని చేస్తున్న సాయి.. కాస్త హద్దులు దాటి బరితెగించి ప్రవర్తించాడు. ఇటీవల హెడ్ మాస్టర్ కట్టారం సాయి మద్యం సేవించి స్కూల్ కు వచ్చాడు. అంతేకాకుండా మద్యం మత్తులో విద్యార్థులతో కాస్త అసభ్యకరంగా ప్రవర్తించాడు.
ఈ విషయం చివరికి ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. వెంటనే స్పందించిన అధికారులు.. నిందితుడు కట్టారం సాయిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు పోలీసులు అతడిపై ఫోక్సో చట్టం కింద కేసు కూడా నమోదు చేశారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారుతోంది. ఉపాధ్యాయ వృత్తిలో ఉండి చివరికి ఆ వృత్తికే మచ్చ తేవాలని చూస్తున్న ఇలాంటి దుర్మార్గులకు ఎలాంటి శిక్ష విధించాలి? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
విజయవాడ : జక్కంపూడి షాబాద్ ప్రభుత్వ పాఠశాలల్లో మద్యం సేవించి,చిన్నారులపై అసభ్యంగా ప్రవర్తించిన హెడ్ మాస్టార్ కట్టారాం సాయి సస్పెన్షన్ …ఉత్తర్వులు జారీ…ఇప్పటికే దిశ పోలీస్ స్టేషన్ లో పోక్సో చట్టం క్రింద కేసు నమోదు..ఘటనపై విచారణ జరిపిన అధికారులు#Headmaster #Shabadschool
— NTV Breaking News (@NTVJustIn) March 22, 2023