ఎన్నో ఆశలతో ఆ వివాహిత పుట్టింటిని వీడి అత్తింట్లో అడుగు పెట్టింది. తాను కోరుకున్న జీవితాన్ని భర్త ఇస్తాడనే నమ్మకంతో అతనితో మూడు ముళ్లు వేయించుకుంది. కానీ రోజులు గడుస్తున్న కొద్ది భర్త నుంచి అప్యాయత కరువై, భార్యాపిల్లలను పూర్తిగా పట్టించుకోవడమే మానేశాడు. భార్యా చాలా కాలం వేచి చూసినా.. భర్తలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురై ఇద్దరు పిల్లలతో పాటు ఆత్మహత్యకు పాల్పడింది. తాజాగా కృష్ణ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికుల కంట కన్నీరు తెప్పిస్తుంది. అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అది విజయవాడ కృష్ణలంకలోని గీతానగర్ కట్ట. ఇదే ప్రాంతానికి చెందిన గోపాలకృష్ణ, లక్ష్మీ దంపతులు. వీరికి 2017లో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లల సంతానం. భర్త స్థానికంగా లారీ డ్రైవర్ గా పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. అయితే గత కొంత కాలం నుంచి భర్త తాగుడుకు బానిసై భార్యను, పిల్లలను పట్టించుకోవడమే మానేశాడు. తాను కోరుకున్న జీవితాన్ని భర్త ఇవ్వకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైంది. ఈ క్రమంలోనే బుధవారం పుట్టింటికి పిల్లలతో పాటు అదే రోజు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చింది. వస్తూ వస్తూనే పురుగుల మందు తెచ్చుకుంది. అయితే అదే రోజు రాత్రి లక్ష్మీ పిల్లలకు విషమిచ్చి తాను కూడా తాగింది.
ఇది కూడా చదవండి: Medchal District: ముగ్గురూ స్నేహితులే.. యువతి వారిని నమ్మి బైక్ ఎక్కింది!
చికటి పడిన తర్వాత భర్త రాత్రి ఇంటికి చేరుకున్నాడు. దీంతో ఇంట్లోకి వచ్చి చూసేసరికి భార్యా, పిల్లలు విగతజీవులుగా పడి ఉన్నారు. వెంటనే భయంతో భర్త పోలీసులకు సమాచారం అందించాడు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మరణించారని నిర్దారించారు. దీంతో అనంతరం పోలీసులు మృతదేహాలు పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.