నేటి కాలంలో పెళ్లైన చాలా మంది కట్టుకున్న వాళ్లను కాదని పరాయి సుఖం కోసం వెంపర్లాడుతున్నారు. భార్యను కాదని భర్త, భర్తను కాదని భార్య. ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు అక్రమ సంబంధాల మోజులో పడి చివరికి దారుణాలకు తెగబడుతున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటనే తాజాగా ఏపీలో చోటు చేసుకుంది. ఇదే ఘటన ఇప్పుడు సంచలనంగా మారుతుంది. అసలు ఈ ఘటనలో ఏం జరిగింది? ప్రియురాలు ఇచ్చిన షాక్ ఏంటనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఏపీలోని విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు గ్రామం. ఇక్కడే వాన రమణ (30) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతని గతంలో ఓ మహిళతో వివాహం జరిగి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే రమణ తాపీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ వస్తున్నాడు. ఇదిలా ఉంటే రమణ భార్యను కాదని స్థానికంగా ఉండే లక్ష్మి అనే మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. దీంతో సమయం దొరికినప్పుడల్లా ఇద్దరూ ఎంజాయ్ చేస్తూ వచ్చారు. ఇకపోతే లక్ష్మి ఉన్నట్టుండి ప్రియుడు రమణను దూరం పెట్టే ప్రయత్నం చేసింది. ఇది రమణకు కోపం తెచ్చింది.
దీంతో రమణ ఇటీవల ఇదే విషయం గురించి ప్రియురాలిని ప్రశ్నించాడు. దీనికి ప్రియురాలు బదులిస్తూ.. పిల్లలు పెరిగి పెద్దవారవుతున్నారని, ఇక నుంచి ఇలాంటి పనులు చేయడం నాకు నచ్చడం లేదని చెప్పింది. ప్రియురాలు మాటలు రమణ తట్టుకోలేకపోయాడు. అయినా వదలకుండా రమణ అనేకసార్లు లక్ష్మితో శారీరకంగా కలిసే ప్రయత్నం చేశాడు. ఇక రమణ టార్చర్ ను భరించలేని లక్ష్మి పోలీసులు కూడా ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉంటే లక్ష్మి మరొకరితో వివాహేతర సంబంధం నడిపిస్తుందని రమణ అనుమానించడం మొదలు పెట్టాడు.
ఇదిలా ఉంటే రమణ ఇటీవల మధ్యాహ్నం ప్రియురాలి ఇంటికి వెళ్లి ఆమెతో గొడవకు దిగాడు. దీంతో ఇద్దరు ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. ఇక తట్టుకోలేకపోయిన లక్ష్మి ఇంట్లో ఉన్న పదునైన ఆయుధంతో రమణను పొడిచింది. ఈ దాడిలో రమణ రక్తపు మడుగులో పడిపోయాడు. వెంటనే స్పందించిన స్థానికులు రమణను ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇక చికిత్స పొందుతు రమణ గురువారం ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనపై రమణ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.