విజయవాడలో దారుణం వెలుగు చూసింది. ఓ అన్న తన సొంత తమ్ముడిని దారుణంగా హత్య చేశాడు. అంతేకాకుండా అడ్డొచ్చిన తల్లిని, మృతుడిపై భార్యపై కూడా దాడికి పాల్పడ్డాడు. అసలేం జరిగిందంటే?
ఏపీలో దారుణం చోటు చేసుకుంది. ఓ అన్న తన సొంత తమ్ముడిని దారుణంగా హత్య చేశాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు అన్న తమ్ముడిని ఎందుకు హత్య చేశాడు? అందుకు దారి తీసిన పరిస్థితులు ఏంటనే పూర్తి వివరాలు మీ కోసం. పోలీసుల కథనం ప్రకారం.. వాత్సవాయి మండలం మంగోల్లు గ్రామంలో భారతమ్మ అనే మహిళ నివాసం ఉంటుంది. ఈమెకు రాజేష్, రవి అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.
పెద్ద కొడుకు రాజేష్ డ్రైవర్ గా పని చేస్తుండగా, చిన్న కుమారుడు రవి తల్లితో పాటు గ్రామంలో వ్యవసాయం చేస్తున్నాడు. ఇక ఇద్దరికీ పెళ్లిళ్లు అయి పిల్లాపాపలతో సంతోషంగా ఉన్నారు. అయితే గత కొంత కాలం నుంచి అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. దీంతో అనేకసార్లు వీరికి పెద్దలు నచ్చజెప్పారు. ఇకపోతే ఇటీవల తన భార్యను తమ్ముడి సాయంతో తల్లి భారతమ్మ పుట్టింటికి పంపించిందని రాజేష్ కోపంతో రగిలిపోయాడు. ఈ కారణంతో సోదరుడు అతడు తల్లి, తమ్ముడిపై కోపంతో ఊగిపోయాడు. ఈ క్రమంలోనే అన్న రాజేష్ తన తమ్ముడు రవిపై పగ పెంచుకున్నాడు. ఎలాగైన రవిని చంపాలని అనుకున్నాడు.
ఇకపోతే ఇటీవల ఓ రోజు తమ్ముడు రవి ఇంట్లో ఉండగా అతని ఇంటికి వచ్చి రాజేష్ గొడవ పడ్డాడు. ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. ఇక కోపంతో ఊగిపోయిన రాజేష్ తమ్ముడి రవిని గొంతు పిసికి హత్య చేశాడు. ఆ సమయంలో అడ్డుకోవడానికి వచ్చిన తల్లి భారతమ్మ, మరదలిపై రాజేష్ తీవ్రంగా దాడి చేసి పరారయ్యాడు. దీంతో వెంటనే స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిని వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.