ఒంటిరిగా ఉన్న యువతిపై కన్నేశాడో యువకుడు. వెంటపడ్డాడు, వేధించాడు. దీంతో ఆ యువతి తట్టుకోలేకపోయింది. ఇక అపరకాళిగా మారిన యువతి కర్రతో యువకుడిని నడి రోడ్డుపై చితకొట్టింది. తాజాగా విజయవాడలో జరిగిన ఈ ఘటన కాస్త వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గన్నవరం ఎయిర్ పోర్టులో పని చేస్తున్న ఓ యువతి విధులు ముగించుకుని ఇంటికి వెళ్తోంది. అయితే ఈ సమయంలోనే ఓ యువకుడు ఆ యువతిపై కన్నేసి బైక్ పై వచ్చి వేధింపులకు గురి చేశాడు.
ఇది కూడా చదవండి: BSC Student: తనకు శాపం ఉందంటూ బీఎస్సీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం..
దీంతో ఆ యువతికి కోపం చిర్రెత్తుకొచ్చింది. అందరిలా మౌనంగా ఉండకుండా అపరకాళిగా మారి కర్రతో నడిరోడ్డపై యువకుడికి సరైన బుద్ది చెప్పింది. అమ్మాయిల్ని వేధిస్తారా అంటూ మనోడి చెమడాలు వలిచింది. దీంతో స్థానికులు ఆ యువతిని ధైర్యానికి ప్రశంసలు కురిపిస్తున్నారు. అమ్మాయిలను వేధించే ఇలాంటి పోకిరిలకు ఇలాగే బుద్దే చెప్పాలంటూ స్థానికులు వాపోతున్నారు. ఇదే ద్రుశ్యాన్ని కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.