ఒంగోలుకు చెందని యువతి, విజయవాడకు చెందని యువకుడు ఇద్దరూ ప్రేమించుకున్నారు. కలిసి జీవించాలనుకున్నారు. ఇందులో భాగంగానే ఆ యువతి ఇటీవల ప్రియుడితో వెళ్లిపోయింది. వెంటనే ఆ యువతి మేనమామ మాట్లాడదామని కోడలు ప్రియుడు ఇంటికి వెళ్లాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఒంగోలులో శ్వేత అనే యువతి తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటుంది. అయితే ఆ యువతికి విజయవాడకు చెందిన నవీన్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ఇద్దరి మధ్య ప్రేమగా మారింది. అలా కొన్నేళ్ల పాటు వీరి ప్రేమాయణం కొనసాగింది. దీంతో శ్వేత ప్రియుడిని విడిచి ఉండలేకపోయింది. ఈ క్రమంలోనే ఇద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే శ్వేత ఇటీవల ప్రియుడితో పాటు వెళ్లిపోయింది. ఈ విషయం తెలుసుకున్న శ్వేత మేనమామ కోడలి ప్రియుడి ఇంటికి వెళ్లి మళ్లీ తిరిగి రాలేదు. అసలేం జరిగిందంటే?
విజయవాడ సత్యనారాయణపురానికి చెందిన నవీన్ కు ఒంగోలుకు చెందిన శ్వేత అనే యువతితో పరిచయం ఉంది. ఈ పరిచయంతోనే ఇద్దరూ కొన్నాళ్ల పాటు మాట్లాడుకున్నారు. అలా కొన్నాళ్ల తర్వాత ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించుకున్నారు. అలా వీరి ప్రేమాయణం కొన్నేళ్లు గడిచింది. అయితే ఇద్దరు ఒకరిని విడిచి మరొకరు ఉండలేకపోయారు. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఇక ఇందులో భాగంగానే శ్వేత ఇటీవల ప్రియుడు నవీన్ తో వెళ్లిపోయింది. ఈ విషయం తెలుసుకున్న శ్వేత కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. వెంటనే శ్వేత మేనమామ అయిన శ్రీనివాస్ విజయవాడకు వెళ్లి శ్వేతను తిరిగి తీసుకురావాలని అనుకున్నారు.
దీంతో శ్రీనివాస్ తో పాటు అతని కుటుంబ సభ్యులు అందరూ కలిసి విజయవాడలోని నవీన్ ఇంటికి వెళ్లారు. అక్కడికి వెళ్లాక శ్వేత మామ శ్రీనివాస్ తో పాటు నవీన్ కుటుంబ సభ్యులు అందరూ కలిసి మాట్లాడుతున్నారు. ఈ క్రమంలోనే శ్వేత మేనమామ శ్రీనివాస్.. శ్వేతను మాతో పాటు తీసుకెళ్తామని అడిగాడు. దీనికి నవీన్ సోదరుడు జగదీష్ కోపంతో ఊగిపోయి శ్రీనివాస్ తో గొడవకు దిగాడు. దీంతో ఇద్దరు ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. ఆగ్రహంతో ఊగిపోయిన జగదీష్.. శ్వేత మేనమామపై కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో శ్రీనివాస్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.