నిత్యం మనం ఎన్నో అగ్నిప్రమాదాలు చూస్తున్నాం. ముఖ్యంగా వేసవికాలంలో ఎక్కువగా అగ్నిప్రమాదాలు జరుగుతాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని ఫైర్ సేఫ్టీ కోసం నిబంధనలు పాటించాలి. తాజాగా ఢిల్లీలో ఓ కోచింగ్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విద్యార్థులు తాడు సాయంతో భవనం కిటికీలోంచి కింది దూకి ప్రాణాలను కాపాడుకున్నారు.
ఈ సంవత్సరం వేసవికాలంలో ఎండలు చాలా మండిపోతున్నాయి. ఎండల వేడికి తాళలేక పోతున్నారు.అత్యవసరమైతే తప్ప బయటికి ఎవరు రావట్లేదు. ఈ ఏడాది వడదెబ్బతో చాలామంది చనిపోయారు. ఇంట్లో ఉన్న వాహనాలు కూడా వేడికి మంటలు చెలరేగిన సంఘటనలు చూశాం. వేసవిలో చాలాచోట్ల అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతాయి. సాధారణంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదాలు జరుగుతాయి. వాతావరణంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడంతో మంటలు చెలరేగుతాయి. అలాగే మన దేశ రాజధాని ఢిల్లీలో అనుకోని సంఘటనలెన్నో జరుగుతుంటాయి. పూర్తి వివరాలు తెలిసేలోపే అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ కోచింగ్ సెంటర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో కోచింగ్ సెంటర్ లోని విద్యార్థులంతా తాడు సాయంతో కిందకు దిగారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే..
దేశ రాజధాని ఢిల్లీలోని ముఖర్జీ నగర్‌లో ఓ భవనం ఉంది. ఆ భవనం పై అంతస్తులో కోచింగ్ సెంటర్ ఉంది. గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఘోర అగ్ని ప్రమాదం చేసుకుంది.
ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కోచింగ్ సెంటర్లోని విద్యార్థులందరు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఉన్నారు.కోచింగ్ సెంటర్ బిల్డింగ్‌కి కిటికీలు ఉండడంతో కిటికీల నుంచి తాడు సాయంతో కిందికి దిగారు. ఈ అగ్ని ప్రమాదంలో నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని చెలరేగిన మంటలను అదుపుచేశారు. అధికారులు సమాచారం అందుకున్న వెంటనే 11 అగ్ని మాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. కొంతమంది విద్యార్థులను ఫైర్ సిబ్బంది బయటకు తీసుకువచ్చారని ఢిల్లీ ఫైర్ సేఫ్టీ చీఫ్ వెల్లడించారు. అగ్నిప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు.
#WATCH | People escape using wires as fire breaks out in a building located in Delhi’s Mukherjee Nagar; 11 fire tenders rushed to the site, rescue operation underway
(Source: Delhi Fire Department) pic.twitter.com/1AYVRojvxI
— ANI (@ANI) June 15, 2023