ఉత్తర్ ప్రదేశ్ లోని ఓ ప్రాంతంలో ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. లిఫ్ట్ లో ఒంటరిగా బాలిక ఉండడం చూసి బరితెగించి ప్రవర్తించాడు. ఆ సమయంలో ఆ అమ్మాయికి ఏం చేయాలో తెలియక భయంతో వణికిపోయింది. అసలేం జరిగిందంటే?
ఈ మధ్యకాలంలో కొందరు యువకులు బరితెగించి ప్రవర్తిస్తున్నారు. రోడ్డుపై అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు.. లైంగికంగా వేధింపులకు గురి చేస్తూ అత్యాచార దాడులకు పాల్పడుతున్నారు. ఇక అడ్డు చెబితే చివరికి హత్యలకు కూడా వెనకాడడం లేదు. అచ్చం ఇలాగే హద్దులు దాటిన ఓ యువకుడు స్కూల్ అమ్మాయిపై లిఫ్ట్ లో దారుణానికి పాల్పడ్డాడు. అతడు చేసిన పనికి లిఫ్ట్ లో అమ్మాయికి ఏం చేయలేక నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది. ఇదంతా అందులో ఉండే సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారిపోయింది. ఇంతకి లిఫ్ట్ లో ఆ అమ్మాయిని అతడు ఏం చేశాడనే కదా మీ ప్రశ్న?
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్ లోని హైరాజ్ సొసైటీలో ఓ బాలిక తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటూ స్థానికంగా ఓ స్కూల్ లో చదువుకుంటుంది. అయితే ఆ అమ్మాయి ఇటీవల వాళ్లు ఉండే అపార్ట్ మెంట్ లో కిందకు వెళ్లడానికి ఒంటరిగా లిఫ్ట్ ఎక్కింది. ఓ ఫ్లోర్ లో లిఫ్ట్ ఆగగానే ఇద్దరు వ్యక్తులు ఆ లిఫ్ట్ లోకి ఎక్కారు. ఓ బాలిక ఒంటరిగా ఉండడం చూసి అందులో ఓ వ్యక్తి… చేతిలో ఉన్న కత్తిని చూపించి బెదిరించాడు. ఆ సమయంలో ఆ బాలికకు ఏం చేయాలో అస్సలు అర్థం కాక భయంతో వణికిపోయింది. దిగాల్సిన ఫ్లోర్ రావడంతో వాళ్లిద్దరు వ్యక్తులు దిగి వెళ్లిపోయారు. ఆ దృశ్యాలన్నీ లిఫ్ట్ లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అనంతరం బాధిత బాలిక తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలస్తుంది. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే ఇదే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
— Hardin (@hardintessa143) May 9, 2023