వివాహేతర సంబంధం.. ఇదే పచ్చని సంసారంలో నిప్పులు పొస్తుంది. భర్తను కాదని భార్య, భార్యని కాదని భర్త. ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు అక్రమ సంబంధాలను వేలుపెడుతూ నిండు కాపురాలను చేతులారా నాశనం చేసుకుంటున్నారు. అచ్చం ఇలాగే ఓ మహిళ భర్తను కాదని పెళ్లికాని కుర్రాడిపై మనసు పడింది. దీంతో అతనితో ఎంజాయ్ చేసి చివరికి ఊహించని రీతిలో శవమై కనిపించింది. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ ఘటనలోనే అసలేం జరిగిందనే పూర్తి వివరాలు మీకోసం.
ఉత్తరాఖండ్ డేహ్రాడూన్ పరిధిలోని ధరంపూర్ ప్రాంతంలో ఓ మహిళ నివాసం ఉంటుంది. గతంలో ఈ మహిళకు ఓ వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు ఆ వివాహిత భర్తతో బాగానే సంసారం చేసింది. ఇదిలా ఉంటే ఆ మహిళ అప్పుడప్పుడు తన పుట్టింటికి వచ్చిపోతూ ఉండేది. ఈ క్రమంలోనే ఆ మహిళ స్థానికంగా ఉండే ఓ పెళ్లికాని కుర్రాడిపై మోజుపడింది. కొంత కాలం పాటు ఆ మహిళ ఆ యువకుడితో తరుచు ఫోన్ లో మాట్లాడుతూ ఉండేది. ఇదే పరిచయం రాను రాను ఇద్దరి మధ్య వివాహేతర సంబంధంగా మారిపోయింది.
దీంతో సమయం దొరికినప్పుడల్లా ఆ మహిళ ప్రియుడితో రొమాన్స్ చేస్తూ ఉండేది. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. ఇటీవల వారిద్దరూ ఓ ఇంట్లోకి వెళ్లారు. కట్ చేస్తే మరుసటి రోజు కొందరు వాళ్లున్న ఇంటి బెడ్రూం తలుపులు తెరిచి చూడగా.. ఇద్దరూ శవాలుగా కనిపించారు. ఈ సీన్ ను చూసిన స్థానికులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అనంతరం యువతి, యువకుడు తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు.
అనంతరం స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత యువకుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే పోలీసుల ప్రాథమిక విచారణలో మాత్రం.. ప్రేమ వ్యవహారం కారణంగానే వీరిద్దరు ఆత్మహత్య చేసుకున్నారని తేలింది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.