దేశంంలో లైంగిక దాడులు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు రూపొందించినప్పటికీ దుర్మార్గుల ప్రవర్తనలో మార్పు మాత్రం రావడం లేదు. ఇదిలా ఉంచితే ఉత్తరాఖండ్ లో మాత్రం ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. ఉధమ్ పూర్ జిల్లా కేంద్రంలో ఇద్దరు సోదరులకు పెళ్లైంది. పెద్ద సోదరుడికి 15 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. చిన్నోడు కొన్నేళ్ల కిందటే పెళ్లి చేసుకున్నాడు. చెడు తిరుగుళ్ల కారణంగా చిన్నోడు ఎయిడ్స్ వ్యాది బారినపడ్డాడు. అతని ద్వారా భార్యకు కూడా హెచ్ఐవీ సోకింది.
ఈ విషయం ఒకరికి ఒకరు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. కానీ కొన్నాళ్లకి భర్త మరణించడంతో భార్య ఒంటరిదైంది. అలా కొన్నాళ్లకి తన బావ కుమారుడైన 15 ఏళ్ల కొడుకుతో పిన్నీ కాస్త చనువుగా ఉండేది. ఆ చనువుతోనే పిన్నీ ఆ బాలుడిని శారీరకంగా వాడుకోవాలని చూసింది. దీంతో సమయం దొరికినప్పుడల్లా ఆ పిల్లాడితో లైంగికదాడికి పాల్పడడంతో పాటు ఎవరికి చెప్పొద్దని బెదిరించింది. కానీ గుట్టచప్పుడు కాకుండా పిల్లాడితో పిన్నీ శారీరకంగా కలుసుకున్నప్పుడు పిల్లాడి తల్లి చూసింది. దీంతో కోపంతో ఊగిపోయి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇది కూడా చదవండి: పెళ్లైన వ్యక్తితో ప్రేమ.. రక్తంతో ‘ఐ లవ్‌యూ దీపక్’ అంటూ నోట్ రాసి..ఇక పోలీసుల విచారణలో మాత్రం ఆ మహిళ సంచలన నిజాలు బయటపెట్టింది. నేను ఉద్దేశపూర్వకంగా చేశానని తెలిపింది. ఎయిడ్స్ తో నా భర్త మరణించాడని, తన బావ కుటుంబాన్ని కూడా నాశనం చేసేందుకే ఇలా చేయాల్సి వచ్చిందని నిందితురాలు తెలిపింది. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.