మారుమూల గ్రామాల్లోని ప్రజలు నేటికి మంత్ర తంత్రాలు, బాబాలను నమ్ముతూనే ఉన్నారు. అలా నమ్మి వచ్చిన అమాయక ప్రజలను కొందరు బాబా ముసుగులో ఉన్నవ్యక్తులు అందినకాడికి దోచుకుంటూ, శారీరకంగా వాడుకుంటున్నారు. ఇలా బరితెగించి ప్రవర్తించిన ఓ బాబా 19 ఏళ్లుగా ఓ మహిళపై అత్యాచారం చేస్తూనే ఉన్నాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది ఉత్తరాఖండ్‌లోని కరన్పుర్ ప్రాంతం. ఇదే ప్రాంతానికి చెందిన ఓ మహిళ చాలా కాలం నుంచి నివాసం ఉంటుంది. అయితే స్థానికంగా పరమానంద పురి అలియాస్ ప్రవీణ్ గుజ్రాల్ అనే బాబా నివాసం ఉండేవాడు. ఆ మహిళ పెళ్లికానప్పటి నుంచి ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినా బాబా వద్దకు వెళ్లేది. ఇక ఇదే సమయమనుకున్న ఆ బాబా ఆ మహిళను శారీరకంగా లోబరుచుకుని అత్యాచారం చేసేవాడు. ఇక కొన్నాళ్ల తర్వాత ఓ మానసిక రోగితో ఆ మహిళకు వివాహం జరిపించాడు.
ఇది కూడా చదవండి: క్లాస్ రూమ్ లో మాస్టారు వెకిలి చేష్టలు.. ఎవరికైనా చెబితే తాళి కట్టేస్తా!
తర్వాత ఆ మహిళకు ఇద్దరు కూతుళ్లు జన్మించారు. అయితే అప్పటి వరకూ బాబా మహిళపై అత్యాచారం చేయడంతో పాటు ఆర్థికంగా కూడా అందిన కాడికి దండుకున్నాడు. అయితే ఇటీవల అదే బాబా ఆమె కూతుళ్లపై కూడా కన్నేశాడు. దీంతో తట్టుకోలేకపోయిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాబాను విచారించారు. ఆ మహిళ కావాలనే నన్ను ఇరికించే ప్రయత్నం చేస్తోందంటూ ఎదురుదాడికి దిగాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.