Crime News: ఈ మధ్య కాలంలో మహిళలపై అఘాయిత్యాలు చాలా పెరిగిపోయాయి. ముఖ్యంగా శారీరక సంబంధాల నేపథ్యంలోనే మహిళలపై ఈ ఘోరాలు జరుగుతున్నాయి. తాజాగా, ఓ హోటల్ గదిలోని వాష్ రూమ్‌లో ఉరికి వేలాడుతూ యువతి శవం కనిపించిది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో బుధవారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్, లక్నోలోని సుశాంత్ గోల్ఫ్ సిటీకి చెందిన నితిన్ ద్వివేదీ అదే ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయి గత కొద్ది నెలలుగా ప్రేమించుకుంటున్నారు. నితిన్ ఆదివారం తన ప్రియురాలితో కలిసి భంస్‌మండిలోని హోటల్ 9కు వెళ్లాడు. ఇద్దరూ 12 గంటల సమయంలో రూమ్ నెంబర్ 901లో దిగారు. సోమవారం రాత్రి 12 గంటలకు నితిన్ తన స్నేహితుడు సుశీల్ కుమార్ జైస్వాల్ కోసం మరో రూమ్ బుక్ చేశాడు. అతడు రూమ్ నెంబర్ 924లో దిగాడు.
రూమ్ నెంబర్ 924లో ఉన్న వ్యక్తి తన స్నేహితుడని అప్పుడప్పుడు రూమ్‌కి వెళ్లి వస్తుంటానని నితిన్ ప్రియురాలు హోటల్ ఆపరేటర్‌తో చెప్పింది. 901లో ఉండగానే ఫుడ్ ఆర్డర్ చేసింది. ఓ ప్లేట్‌తో రూమ్ నెంబర్ 924లోకి వెళ్లింది. మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో సుశీల్ కుమార్ హోటల్‌నుంచి బయటకు వెళ్లిపోయాడు. తర్వాత వస్తానని రిసెప్షన్‌లో చెప్పి వెళ్లాడు. అతడు వెళ్లిపోయిన తర్వాత నితిన్ తన ప్రియురాలి ఫోన్‌కు కాల్ చేశాడు. అటునుంచి స్పందన రాలేదు. దీంతో నితిన్, సుశీల్‌కు ఫోన్ చేశాడు. ఆమె బాత్‌రూమ్‌లోకి వెళ్లిందని సుశీల్ చెప్పాడు. అయితే, గంటలు గడుస్తున్నా ప్రియురాలు రాకపోవటంతో నితిన్ 924 గదికి వెళ్లాడు.
వాష్ రూమ్ లోపలినుంచి గడియపెట్టి ఉంది. పిలిచినా కూడా ఆమెనుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో నితిన్ హోటల్ సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. వారు వాష్ రూమ్ తలుపులు బద్ధలు కొట్టారు. లోపల నితిన్ ప్రియురాలు అర్థనగ్నంగా సీలింగ్‌కు వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి ప్రియుడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పరారీలో ఉన్న సుశీల్ కుమార్ కోసం గాలిస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : భార్య, కూతురిని నగ్నంగా ఆరు బయట కూర్చోబెట్టిన భర్త! కారణం ఇదే!