ప్రస్తుతం సమాజంలో నేరాలు అధికంగా పెరుగుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా నేర ప్రవృత్తి పెరుగుతోంది. పట్టుమని పదేళ్లు కూడా నిండని పిల్లలు అత్యాచారం, హత్య వంటి నేరాలకు పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది. చక్కగా చదువుకుని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరాల్సిన చిన్నారులు, యువత తప్పుడు మార్గంలో పయనించి.. వారి జీవితాలతో పాటు కుటుంబాలను కూడా నాశనం చేస్తున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ దారణాన్ని చూస్తే.. ఎలాంటి సమాజంలో ఉన్నామో అర్థం అవుతుంది. ఆ కుర్రాడికి చదువు అంటే ఇష్టం లేదు. కానీ తల్లిదండ్రులు బడికి వెళ్లాల్సిందే అని బలవంతం చేస్తున్నారు. అయిష్టంగానే బడికి వెళ్తున్నాడు.
ఈ క్రమంలో వాడికి జైలుకెళ్తే.. చదువు బాధ తప్పుతదని ఎవరో చెప్తే విన్నాడు. ఇదేదో బాగుంది కదా.. అని భావించి స్నేహితుడిని హత్య చేశాడు. అంతేకాక.. నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి.. తనను అరెస్ట్ చేయమన్నాడు. పోలీసులకు ఏం అర్థం కాలేదు. దాంతో ఆ పిల్లాడు తాను చెసిన దారుణం గురించి చెప్పాడు. ఒక్కసారిగా ఉల్కిపడిన పోలీసులు ఆ బాలుడిని అరెస్ట్ చేసి జువైనల్ హోమ్‌కి తరలించారు. ఆ వివరాలు..
ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ లఖ్‌నవూలో చోటు చేసుకుంది. పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థికి చదువంటే ఇష్టం లేదు. అసలే పదో తరగతి.. ఫెయిల్ అయితే ఇంట్లో తిడతారు. అసలు ఈ చదువు గోల లేకపోతే బాగుటుంది అనుకున్నాడు. ఈ క్రమంలో ఆ కుర్రాడికి జైలుకు వెళ్తే.. చదువుకునే అవసరం ఉండదని తెలసింది. దాంతో స్కూల్లో తనతో పాటు ఎనిమిదో తరగతి చదువుతున్న స్నేహితుడుని గొంతు కోసి హత్య చేశాడు.
నిందితుడు, మృతి చెందిన కుర్రాడు నీరజ్ ఇద్దరు పక్క పక్క ఇళ్లలోనే నివాసం ఉండేవారు. మంచి స్నేహితులు కూడా. ఈ క్రమంలో సోమవారం నిందిత బాలుడు.. ఆడుకుందాం రా అంటూ మృతుడిని బయటకు తీసుకెళ్లాడు. నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లిన తర్వాత తన స్నేహితుడి గొంతు కోసి హత్య చేశాడు. ఇక హత్య చేసిన కుర్రాడు.. పోలీసు స్టేషన్‌కు వెళ్లి తనను అరెస్ట్ చేయమని చెప్పాడు. అతడి ప్రవర్తనకు ఆశ్చర్యపోయిన పోలీసులు.. ఏమైంది అని అడగ్గా అని జరిగిన దారుణం గురించి చెప్పాడు.
బాలుడు మాటలు నమ్మని పోలీసులు.. అతడు చెప్పిన ప్రాంతానికి వెళ్లగా.. అక్కడ రక్తపు మడుగులో పడి ఉన్న నీరజ్ కనిపించాడు. వెంటనే పోలీసులు అతడిని ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే నీరజ్ మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఇక విచారణలో సదరు బాలుడు చెప్పిన విషయం విని పోలీసులు ఆశ్చర్యపోయారు. తనకు చదువంటే ఇష్టం లేదని.. కానీ తల్లిదండ్రులు తనను బలవంతంగా స్కూల్‌కు పంపుతున్నారని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో హత్య చేసి జైలుకు వెళ్తే.. చదువుకునే అవసరం లేదని తెలియడంతో.. తన స్నేహితుడి నీరజ్ ప్రాణాలు తీసినట్లు వెల్లడించాడు. కేసు నమోదు చేసిన పోలీసుల.. నిందిత బాలుడిని జువైనల్ హోమ్‌కి తరలించారు. మరి ఈ దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.