ఆడపిల్ల అయినా సరే.. మహాలక్ష్మి పుట్టిందని భావించారు ఆ తల్లిదండ్రులు. తమకు ఉన్నంతలో బిడ్డను ఎంతో బాగా చూసుకున్నారు. ఆమె ఎంత చదివితే.. అంత వరకు చదివించారు. కుమార్తె కూడా తల్లిదండ్రులు ఆశలు, నమ్మకాలకు అనుగుణంగా బాగా చదువుకుంది. గవర్నమెంట్ ఉద్యోగం సాధించింది. బాగా చదువుకుంది.. ప్రభుత్వ ఉద్యోగం సాధించింది.. ఇక పెళ్లి చేయడమే మిగిలుంది అనుకున్నారు తల్లిదండ్రులు. మంచి సంబంధం చూసి వివాహం నిశ్చయించారు. రెండు రోజుల్లో పెళ్లి.. బంధువులందరూ వచ్చారు. ఎంతో ఘనంగా హల్దీ వేడుక నిర్ణయించారు. ఇక స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్లిన లేడీ కానిస్టేబుల్ ఎంతకి బయటకు రాలేదు.. తలుపు బద్దలు కొట్టి చూడగా.. లోపల కనిపించిన దృశ్యం చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇంతకు ఏం జరిగింది అంటే..
ఉత్తరప్రదేశ్‌లో ఈ విషాదకర సంఘటన చోటు చేసుకుంది. లేడీ కానిస్టేబుల్ తీసుకున్న నిర్ణయంతో పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో.. చావు కబురు తెలిసి గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. మేవఠ్‌కు చెందిన మున్నీదేవి కుమార్తె గీతా.. చదువు పూర్తి చేసుకుని.. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తోంది. ప్రసుత్తం ఆమె ముజఫర్‌నగర్‌లో విధులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో గీతాకు బులంద్‌శహర్‌కు చెందిన సుమిత్‌తో వివాహం నిశ్చయించారు.
జనవరి 7న వివాహం జరగాల్సి ఉంది. ఆదివారం బంధు మిత్రుల సమక్షంలో ఘనంగా హల్దీ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా గీతకు పసుపు పూశారు.. అనంతరం స్నానం చేసేందుకు గీత బాత్రూంకు వెళ్లింది. సుమారు 45 నిమిషాలు గడిచినా సరే.. ఆమెకు బటయకు రాలేదు. కుటుంబ సభ్యులు తలుపు కొట్టి పిలిచినా.. ఎలాంటి స్పందన లేదు. దాంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు.. బాత్‌రూం తలుపులు పగలగొట్టి.. చూడగా.. లోపల కనిపించిన దృశ్యం చూసి వారు భయంతో బిగుసుకుపోయారు.
స్నానం చేయడానికి లోపలికి వెళ్లిన గీత.. అపస్మారక స్థితిలో ఉంది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. గీతను పరీక్షించిన వైద్యులు.. ఆమె మృతి చెందినట్లుగా వెల్లడించారు. గీత మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహిస్తున్నారు. రిపోర్ట్ వచ్చిన తర్వాతే.. గీత మృతికి అసలు కారణాలు వెలుగులోకి వస్తాయని వెల్లడించారు పోలీసులు. రెండు రోజుల్లో పెళ్లి కుమార్తెగా పెళ్లి పీటలు ఎక్కాల్సిన గీత.. ఇలా శవమై పాడె ఎక్కడంతో పెళ్లి ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరి ఈ విషాదకర సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.