భర్తతో పాటు కారులో వెళ్లిన ఆమెను ఓ హోటల్‌కు తీసుకెళ్లారు. హోటల్‌కు వెళ్లగానే ఆమెకు ఓ టీ ఇచ్చారు. ఆ టీ తాగగానే ఆమె స్ప్రహ తప్పి పడిపోయింది. అనంతరం భర్త ముందే మిగిలిన వాళ్లు ఆ మహిళను పాడు చేశారు. భర్త దాన్ని వీడియోగా తీశాడు.
భర్త అంటే భరించేవాడు. భార్య తెలిసో.. తెలియకో చేసిన తప్పుల్ని పెద్ద మనసుతో క్షమించేవాడు. కానీ, కొంత మంది భర్తలు రాక్షసుల్లా మారి.. ఏ పాపం చేయని భార్యల్ని రాచి రంపాన పెడుతున్నారు. మరికొంతమంది అంతకు మించి దారుణంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా, ఓ వ్యక్తి తన భార్యను స్నేహితులతో అత్యాచారం చేయించాడు. దాన్ని వీడియో తీసి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్‌లోని కాధేపూర్ హనుమంత్ విహార్‌కు చెందిన మహిళకు అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి కొన్నేళ్ల క్రితం పెళ్లయింది. పెళ్లయిన కొన్ని నెలలు వీరి కాపురం సజావుగానే సాగింది.
అయితే, తర్వాతినుంచి గొడవలు రావటం మొదలయ్యాయి. మహిళను ఆమె భర్త బాగా కొట్టే వాడు.. తరచూ వేధించేవాడు. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లింది. కుటుంబసభ్యుల సహాయంతో పోలీసులను ఆశ్రయించింది. అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే, ఈ కేసు ఆమె భర్తకు ఇబ్బందిగా మారింది. కేసును విత్‌డ్రా చేసుకోవాలని ఆమెపై ఒత్తిడి తెస్తూ ఉన్నాడు. ఆమె ఇందుకు ఒప్పుకోలేదు. మొత్తం కుటుంబాన్ని చంపేస్తామని తన మనుషులతో భార్యను బెదిరించాడు. ఫిబ్రవరి 11న తన స్నేహితులతో కలిసి కారులో భార్య పుట్టింటికి వచ్చాడు.
ఆమె తమ్ముడ్ని రైల్వే దొంగతనం కేసులో ఇరికిస్తామని, చంపేస్తామని బెదిరించి కారులోకి ఎక్కించుకున్నారు. తర్వాత ఆమెను టాట్‌మిల్‌లోని ఓ హోటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ మత్తు మందు కలిపిన టీ ఇచ్చారు. అది తాగి ఆమె స్ప్రహ కోల్పోయింది. దీన్ని అదునుగా తీసుకుని అందరూ ఆమెపై అత్యాచారం చేశారు. భర్త ఆ దృశ్యాలను వీడియో కూడా తీశాడు. అనంతరం వీడియో చూపించి ఆమెను బెదిరించసాగాడు. దీంతో బాధిత మహిళ పోలీస్ కమిషనర్ ఆఫీస్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.