గత కొంత కాలంగా దేశంలో వరుసగా రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ పదుల సంఖ్యల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, మద్యం సేవించి వాహనాలు నడపడం, నిద్ర లేమి ఇలా కారణాలు ఏవైనా.. ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబాలు రోడ్డుపాలవుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురిలో సమాజ్‌వాదీ పార్టీ నేత దేవేంద్ర సింగ్ యాదవ్ కారును ఓ ట్రక్కు ఢీ కొట్టడమే కాకుండా.. 500 మీటర్ల దూరం లాక్కుని వెళ్ళింది. వివరాల్లోకి వెళితే..
సమాజ్‌వాదీ పార్టీ నేత దేవేంద్ర సింగ్ యాదవ్ తన కారులో ప్రయాణిస్తున్న సమయంలో అతని పక్క నుంచి ట్రక్కు వచ్చి ఢీ కొట్టడమే కాదు.. కారును దాదాపు 500 మీటర్ల దూరం వరకు ఈడ్చుకు వెళ్లింది. కారు ఆగిన వెంటనే, రోడ్డుపై ఉన్నవారు దేవేంద్ర సింగ్ స్థానికులు రక్షించారు. మొత్తానికి ఈ ప్రమాదంలో దేవేంద్ర ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
ప్రమాదం నుంచి బయట పడ్డ ఆయన మెయిన్‌పురి సదర్ కొత్వాలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ట్రక్కు డ్రైవర్ ని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని ఎస్పీ కమలేశ్ దీక్షిత్ తెలిపారు. తాజాగా ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#WATCH A truck dragged the car of SP District President Devendra Singh Yadav for about 500 meters in UP’s Mainpuri pic.twitter.com/86qujRmENr
— ANI UP/Uttarakhand (@ANINewsUP) August 8, 2022
मैनपुरी सपा जिलाध्यक्ष जी पर ट्रक द्वारा जानलेवा हमला।
500 मी गाड़ी को घसीटता रहा ट्रक , ईश्वर की कृपा से अध्यक्ष जी सुरक्षित ॥ pic.twitter.com/gdqWThpEhD— Samajwadi Party Mainpuri (@Samajwadi_mpi) August 7, 2022