ఓ అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకుని పెళ్లి చేసుకోవడం సర్వసాధారణం. కానీ ఓ పెళ్లైన వివాహిత, అమ్మాయి ప్రేమలో పడి పెళ్లి చేసుకోవడం ఎప్పుడైన చూశారా? వినటానికి ఆశ్చర్యంగా ఉన్న ఈ వార్త నిజం. వీళ్లు ప్రేమించుకోవడమే కాదు.., ఏకంగా పెళ్లికే రెడీ అవుతున్నారు. ఆలస్యంగా ఉత్తర్ ప్రదేశ్ లో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అసలు స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉత్తర్ ప్రదేశ్ లోని మధుర జిల్లాకు చెందిన ఓ మహిళకు గతంలో ఓ వ్యక్తితో పెళ్లైంది. పెళ్లైన కొంత కాలం వరకు ఈ దంపతులు సంతోషంగానే ఉన్నారు. అలా ఎంతో ఆనందంగా సాగిపోతున్న ఈ దంపతులు జీవితంలో ఆ మహిళకు టిక్ టాక్ లో గోరఖ్ పూర్ కు చెందిన ఓ యువతి పరిచయం అయింది. దీంతో ఒకరికొకరు చాట్ చేసుకుని చివరికి ఫోన్ లో సైతం మాట్లాడుకుంటున్నారు. అలా సాగిపోతున్న వీరి పరిచయం రాను రాను ప్రేమగా మారింది. దీంతో ఒకరికొకరు ఇష్టపడి ప్రేమించుకున్నారు. రోజులు మారుతున్న కొద్ది వివాహిత, అమ్మాయి పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు.
ఇక కొంత కాలానికి ఆ పెళ్లైన మహిళ భర్తతో ఉండడం ఇష్టం లేక అతడిని వదిలి మధురకు వచ్చి ప్రేమించిన యువతితోనే ఉంటుంది. ఇద్దరు ఒకే రూంలో ఉంటూ రొమాన్స్ లో కూడా రెచ్చిపోతున్నారు. అయితే వీరిద్దరు చివరికి పెళ్లిచేసుకోవాలని ఫిక్స్ అయ్యారు. వెంటనే ఆ వివాహిత తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి.. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంటూ తెలిపింది. కూతురు మాటను విన్న ఆ వివాహిత తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
నువ్వు ఇలా చేస్తే మా పరువు పోతుందని, మేము చచ్చిపోతామంటూ ఆ వివాహిత తల్లిదండ్రులు ఆత్మహత్యాయత్నానికి కూడా ప్రయత్నించారు. ఇక ఏదేమైన మేము పెళ్లి చేసుకుంటామని ఆ వివాహిత తెగేసి చెప్పింది. ఈ విషయం చివరికి పోలీసుల వరకు వెళ్లడంతో ఆ వివాహితను, యువతిని పిలిపించించి కౌన్స్ లింగ్ ఇప్పించారు. పోలీసులు నచ్చచెప్పినా కూడా ఆ యువతి, వివాహిత అస్సులు వెనకకు తగ్గడం లేదు. ప్రస్తుతం పోలీసులు వీరిద్దరికి మరోసారి కౌన్స్ లింగ్ ఇచ్చే పనిలో ఉన్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.