ఎంతో నమ్మకంతో కన్నవారిని కాదని భర్తను పెళ్లి చేసుకుంది. కలల కాలం భర్తతోనే ఉండాలని భార్య ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ భర్త మాత్రం.. కట్టుకున్న భార్య, కూతురిపై దారుణానికి పాల్పడ్డాడు. భార్య, కూతురు అందంగా పుట్టారని తట్టుకోలేకపోయాడు. చివరికి కట్టుకున్న భార్య, కడుపున పుట్టిన కూతురి అందాన్ని చూసి తట్టుకోలేక తండ్రి ఊహించని కిరాతకానికి పాల్పడ్డాడు. ఇటీవల చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలు రాష్ట్రాన్ని ఊపేస్తున్న ఈ క్రైమ్ కథలో ఏం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఉత్తర్ ప్రదేశ్ లోని ఘజియాబాద్. ఇక్కడే సంజయ్ పాల్, రేఖ పాల్ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి తషు అనే కూతురు జన్మించింది. భర్త సంజయ్ పాల్ రిక్షా నడుపుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. అలా కొన్నేళ్ల పాటు వీరి కాపురం సంతోషంగానే సాగుతూ వచ్చింది. కూతురు తషుకి 14 ఏళ్ల వయసొచ్చింది. అప్పటి వరకు ఈ దంపతుల సంసారం ఎలాంటి గొడవలు, మనస్పర్ధలు చక్కగా సాగింది. కానీ విషయం ఏంటంటే? భార్య రేఖ పాల్, కూతురు తషు కాస్త అందంగా ఉండేవారు. ఇదే భర్తకు తలనొప్పిగా మారింది.
గత కొంత కాలం నుంచి భర్త సంజయ్ పాల్ భార్యపై కాస్త అనుమానంతో ఉన్నాడు. నీకు పరాయి మగాళ్లతో సంబంధం ఉందని హింసించేవాడు. అలా కొన్నాళ్ల నుంచి భర్త భార్యను అనుమానంతో వేధిస్తూ ఉండేవాడు. ఇదే విషయమై భార్యాభర్తల మధ్య తరుచు గొడవలు కూడా జరుగుతున్నాయి. అయితే శుక్రవారం రాత్రి కూడా భర్త భార్యతో గొడవ పెట్టుకున్నాడు. కూతురిని కాపలా పెట్టుకుని నువ్వు మరొక మగాడితో తిరుగుతున్నావని భార్యపై కోపంతో అరిచాడు. దీంతో భార్యాభర్తలిద్దరూ ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. చంపుతానని భర్త బెదిరించడంతో భార్య రేఖ పాల్ తట్టుకోలేకపోయింది. దీంతో రేఖా పాల్ భర్తపై మరింత ఘాటుగా స్పందించింది.
కోపంతో ఊగిపోయిన భర్త చంపేయాలని ప్లాన్ గీశాడు. ఇందులో భాగంగానే శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో భార్య నిద్రలోకి జారుకున్నాక ఇంట్లో ఉన్న పారతో భార్యను హత్య చేశాడు. అనంతరం మరో గదిలో నిద్రిస్తున్న కూతురిని సైతం తండ్రి దారుణంగా కొట్టి చంపాడు. ఆ తర్వాత ఇంట్లో నుంచి పరుగులు తీసి నా భార్యను, కూతురిని చంపానంటూ తన స్నేహితుడికి ఫోన్ చేసి చెప్పాడు. ఇదే విషయాన్ని సంజయ్ పాల్ స్నేహితుడు పోలీసులకు చెప్పాడు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. అనంతరం పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇక రేఖ పాల్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలంగా మారుతోంది.