ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం వెలుగు చూసింది. ఓ యువతిని ఫేస్ బుక్ ద్వారా పరిచయం చేసుకుని పాడు పనికి దిగారు ఇద్దరు కానిస్టేబుల్ లు. ఇద్దరు కలిసి ఆ యువతిని అనేక రకాలుగా హింసించారు. అసలేం జరిగిందంటే?
ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. రక్షణగా ఉండాల్సిన కొందరు పోలీసులే బరితెగించి ప్రవర్తించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇంతకు ఆ పోలీసులు ఏం చేశారు. అసలేం జరిగిందనే పూర్తి వివరాలు మీ కోసం. పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్ షమ్లీ జిల్లాలోని ఓ ప్రాంతానికి చెందిన ఇమ్రాన్ మిర్జా అనే యవకుడు కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే ఈ యువకుడికి గతంలో ఫేస్ బుక్ ద్వారా ఓ అమ్మాయి పరిచయం అయింది.
ఈ పరిచయంతోనే ఇద్దరూ కొన్నాళ్ల పాటు ఛాటింగ్ చేసుకున్నారు. ఇక సమయం దొరికినప్పుడల్లా సినిమాలు, షికారులు అంటూ తెగ తిరిగారు. అయితే ఇమ్రాన్ ఆ యువతిని పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించాడు. ఆ అమ్మాయి కూడా సరేంటూ మురిసిపోయి అతనికి ఇంకాస్త దగ్గరైంది. ఇకపోతే ఆ యువకుడు షమ్లీలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఆ యవతిని అందులో ఉంచాడు. ఇమ్రాన్ అప్పుడప్పుడు ఇ గదికి వెళ్తూ ఆ యువతితో అనేక సార్లు శారరీకంగా కలుసుకున్నాడు. మరో విషయం ఏంటంటే? ఇమ్రాన్ తన సోదరుడైన ఫుర్కాన్ (కానిస్టేబుల్) ని కూడా ఆ గదికి చాలా సార్లు తీసుకెళ్లాడు.
అంతేకాకుండా ఇద్దరూ కలిసి ఆ యువతిపై అత్యాచారానికి కూడా పాల్పడ్డారు. ఇలా చాలా సార్లు ఇద్దరూ కలిసి బలవంతంగా ఆ యువతితో కోరిక తీర్చుకున్నారు. దీంతో ఆ అమ్మాయి గర్భం దాల్చింది. దీంతో ఇమ్రాన్ ఆ యువతికి అబార్షన్ చేయించాడు. ఇలా రెండు సార్లకు పైగా అబార్షన్ చేయించినట్లుగా తెలుస్తుంది. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని, చెబితే చంపాస్తానంటూ ఇమ్రాన్ బెదిరించాడని తెలుస్తుంది. ఇక రాను రాను ఇమ్రాన్ వేధింపులు మరింత ఎక్కువవ్వడంతో ఆ యువతి తట్టుకోలేకపోయింది. రోజూ ఆ యువతిని కొట్టడం, అనేక రకాలు హింసించడంతో ఆ నరకం నుంచి బయటపడాలని భావించింది. ఇక ఇందులో భాగంగానే ఆ అమ్మాయి ఇటీవల ఇమ్రాన్ చేసిన దారుణంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలుసుకున్న ఇమ్రాన్, సోదరుడు కేసు వెనక్కి తీసుకోవాలని కూడా బెదరించారని సమాచారం. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.