ఆమెకు గతంలో వివాహం జరిగింది. కానీ, పెళ్లైన కొన్నాళ్లకే బతుకు దెరువు కోసం భర్త విదేశాలకు వెళ్లాడు. కట్ చేస్తే.. భార్య ఇద్దరి ప్రియులతో బెడ్ రూంలో అత్తకు రెడ్ హ్యాండెడ్ గా దొరికింది. ఆ తర్వాత జరిగింది ఇదే.
ఈ రోజుల్లో కొందరు పెళ్లైన మహిళలు భర్తను కాదని చీకటి కాపురానికి తెర లేపుతున్నారు. కట్టుకున్న మొగుడి కళ్లు గప్పి ఎంచక్కా ప్రియుడితో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అలా చాలా కాలం పాటు భర్తకు తెలియకుండా జాగ్రత్త పడుతూ తెర వెనుక సంసారాన్ని నడిపిస్తున్నారు. ఇలాంటి ఘటనలు రోజుకు ఎన్నో చూస్తూనే ఉన్నాం. ఇక అసలు విషయం భర్తకు తెలియడంతో చివరికి తాళి కట్టిన మొగుడికే పాడె కడుతున్నారు. ఇదిలా ఉంటే.. ఓ కోడలు బెడ్ రూంలో ఇద్దరు ప్రియులతో ఎంజాయ్ చేస్తూ అత్తకు అడ్డంగా దొరికింది. ఈ సీన్ చూసిన అత్త ఒక్కసారిగా షాక్ గురైంది. ఆ తర్వాత జరిగింది ఏంటంటే?
పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్ మహారాజ్‌గంజ్ జిల్లా నిచ్లాల్ పరిధిలోని ఓ గ్రామం. ఇక్కడే ఓ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి గతంలో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి ఉపాధి నిమిత్తం భర్త విదేశాలకు వెళ్లాడు. అక్కడే ఉంటూ పైసా పైసా కూడబెడుతున్నాడు. అయితే భర్త ఇంట్లో లేకపోవడంతో భార్య అప్పుడప్పుడు పుట్టింటికి, తమ బంధువుల ఇంటికి వెళ్లి వస్తుండేది. ఈ క్రమంలోనే ఆ మహిళకు బంధువులైన ఇద్దరి వ్యక్తులతో వివాహేతర సంబంధాన్ని నడిపించింది. ఇక సమయం దొరికినప్పుడల్లా వారితో ఎంజాయ్ చేసేది. కోడలితో పాటు ఇద్దరు వ్యక్తులు అప్పుడప్పుడు ఇంటికి వస్తుండడంతో అత్తకు అనుమానం వచ్చింది. వాళ్లు ఎవరని కోడలిని అనేక సార్లు అడిగితే.. మా బంధువులే అంటూ సమాధానం ఇచ్చింది.
ఇకపోతే.. ఇటీవల వారి ఇంటికి మళ్లీ ఆ ఇద్దరు వ్యక్తులు వచ్చి ఏకంగా కోడలి బెడ్ రూంలోకి వెళ్లారు. ఎందుకో వారిపై అత్తకు అనుమానం కలిగింది. అసలు వాళ్లు ఎవరు? అసలేం జరుగుతుందని విషయం తెలుసుకోవాలనుకుంది. ఇందులో భాగంగానే కోడలి బెడ్ రూంలోకి అత్త దొంగచాటున తొంగి చూడగా.. ఇద్దరి ప్రియులతో కోడలు.. చూడకూడని స్థితిలో కనిపించింది. ఆ సీన్ చూసిన అత్త షాక్ గురైంది. వెంటనే కోడలు ఉన్న గదికి తాళం వేసి వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ ముగ్గురుని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.