వీళ్లిద్దరూ చాలా ఏళ్ల నుంచి ప్రేమలో ఉన్నారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా మారిపోయారు. ఇక వివాహం కూడా చేసుకోవాలని అనుకున్నారు. కానీ, వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. ఇదిలా ఉంటే.. ఇటీవల ఈ ప్రేమికులు ఓ హోటల్ కు వెళ్లారు. అక్కడ ఏం జరిగిందంటే?
వీళ్లిద్దరూ ప్రేమికులు. చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ యువతికి పెళ్లైన కూడా ఇతనితో ప్రేమ వ్యవహారాన్ని నడిపిస్తూ వచ్చింది. ఇక వీరిద్దరూ ఇటీవల ఏకాంతంగా కలుసుకోవాలని అనుకున్నారు. ఇందులో భాగంగానే ఓ హోటల్ లో ఓ గదిని బుక్ చేసుకున్నారు. దీంతో ప్రేమికులు ఆ గదిలోకి వెళ్లారు. అక్కడికి వెళ్లాక ఆమె ప్రియుడు చేయాల్సింది అంతా చేసి మరో దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో అసలేం జరిగిందంటే? పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్ లో మోదీనగర్ లో మధు (22) అనే యువతి నివాసం ఉంటుంది.
ఆమెకు గతంలో ఓ యువకుడితో వివాహం జరిగింది. కొన్నాళ్ల పాటు ఈ దంపతుల దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. మరో విషయం ఏంటంటే? మధు పెళ్లి కంటే ముందే హిమాంశు (20) అనే యువకుడితో ఉంది. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ, వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో ఆమె మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. పెళ్లైనా మధు ప్రియుడితో ఫోన్ లో మాట్లాడుతూ ఉండేది. ఇదిలా ఉండగానే ఉన్నట్టుండి మధు భర్త చనిపోయాడు. ఇక కొన్ని రోజుల తర్వాత మధు తల్లిదండ్రులు ఆమెకు స్థానికంగా ఉండే మరో యువకుడితో వివాహం జరిపించారు.
అలా కొన్ని రోజులు గడిచింది. మధుకు ప్రియుడు హిమాంశు మీద ఉన్న ఇష్టం మాత్రం తగ్గిపోలేదు. అయితే, ఇటీవల హిమాంశు తన ప్రియురాలైన మధుని తీసుకుని గాజియాబాద్ లోని ఓ హోటల్ కు వెళ్లాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ, ఓ గంట తర్వాత హోటల్ నిర్వాహకులు ఆ ప్రేమికులు ఉన్న గదిలోకి వెళ్లి చూశారు. అక్కడ బెడ్ పై మధు హత్యకు గురి కాగా, ఆమె ప్రియుడు అదే గదిలో ఫ్యానుకు ఉరి వేలాడుతూ కనిపించాడు. ఈ సీన్ చూసి హోటల్ నిర్వాహకులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.
హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మధు భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే, పోలీసుల ప్రాథమిక నిర్ధారణలో మాత్రం.. ప్రియుడు హిమాంశు ప్రియురాలు మధును హత్య చేసి ఆ తర్వాత తానూ కూడా ఆత్మహత్య చేసుకున్నాడని తేలింది. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.