దేశంలో కామాంధులు రెచ్చిపోతున్నారు. 5 ఏళ్ల బాలిక నుంచి 80 ఏళ్ల ముసలవ్వల వరకూ ఎవరనీ వదలకుండా అత్యాచార దాడులకు దిగుతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనే ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ లో వెలుగు చూసింది.
ఈ మధ్యకాలంలో కొందరు దుండుగులు బరితెగించి ప్రవర్తిస్తున్నారు. రోడ్డుపై అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు.. ఐలవ్ యూ అని చెప్పడం, కాదంటే అత్యాచారాలు, ఆపై హత్యలు చేస్తున్నారు. అయితే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు నిర్భయ, దిశ వంటి చట్టాలు రూపొందించినా.. దుర్మార్గుల ప్రవర్తనలో మాత్రం మార్పు రావడం లేదు. ఇక ఈ ఘటనలు మరువకముందే ఇటీవల ఇలాంటిదే ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం రాంపూర్ లో ఓ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 15 ఏళ్ల కూతురు కూడా ఉంది. భర్త మెకానిక్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే ఇటీవల ఓ రోజు రాత్రి దంపతులు తిని కూతురితో పాటు పడుకున్నారు. ఇక అర్థరాత్రి సమయంలో కొందరు దుండుగులు వీరి ఇంట్లో దొంగతనానికి వెళ్లారు. జోరు నిద్రలో ఉన్న ఆ మహిళ భర్తను ఆ దుర్మార్గులు దాడి చేశారు. ఆ తర్వాత అతడిని తాళ్లతో మంచానికి కట్టేసి ఇంట్లో ఉన్న రూ.5 దొంగిలించారు. అంతే కాకుండా అతని భార్య, కూతురిపై ఒకరి తర్వాత ఒకరు సామూహిక అత్యాచారానికి పాల్పడి అక్కడి నుంచి పరారయ్యారు. ఇక మరుసటి రోజు ఆ వ్యక్తి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ మహిళ, ఆమె కూతురిని ఆస్పత్రికి చేర్పించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.