ఓ ప్రేమ జంట ఏకాంతంగా మాట్లాడుకునేందుకు ఇటీవల ఓ పార్కుకు వెళ్లింది. వీరిని గమనించిన కొందరు యువకులు వారిపట్ల దారుణంగా ప్రవర్తించారు. అంతే కాకుండా దానిని వీడియో కూడా తీసుకున్నారు. అసలేం జరిగిందంటే?
కొందరు యువకులు పార్కులో బరితెగించి ప్రవర్తించారు. ఏకాంతంగా మాట్లాడుకుందామని వచ్చిన ఓ ప్రేమ జంటపై రెచ్చిపోయి దారుణంగా బిహేవ్ చేశారు. అలా చేయడమే కాకుండా తమ సెల్ ఫోన్ లలో వీడియోలు కూడా తీసుకున్నారు. ఇక అదే వీడియోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో కాస్త వైరల్ గా మారింది. పార్కులో ఉన్న ప్రేమ జంటపై ఆ యువకులు ఏం చేశారు? అసలేం జరిగిందనేది తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే.
ఉత్తర్ ప్రదేశ్ నోయిడా సెక్టర్-45 ప్రాంతంలో ఓ ప్రేమ జంట ఇటీవల ఓ పార్కుకు వెళ్లారు. అక్కడికి వెళ్లి ఇద్దరూ ఓ చోట ఏకాంతంగా మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కొందరు యువకులు వచ్చి.. మేము పోలీసులమంటూ.. బరితెగించి ప్రవర్తించారు. అన్యాయంగా ఆ యువకుడిపై కొందరు యువకులు ముకుమ్మడిగా దాడి చేశారు. అంతే కాకుండా అతడి ప్రియురాలిని సైతం బెదిరించారు. దీంతో ఆ ప్రేమ జంట అక్కడి నుంచి వెళ్లి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం ఆ ప్రేమ జంటపై దాడికి పాల్పడిన నిందితులు కోసం గాలింపు చర్యలు చేపట్టి ఎట్టకేలకు ఆ యవకులను పోలీసులు తాజాగా అరెస్ట్ చేసినట్లు సమాచారం. అయితే ఆ యువకులు పార్కులో ప్రేమ జంటపై దాడి చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది. పార్కులో ఉన్న ప్రేమ జంటపై అన్యాయంగా దాడి చేసిన ఆ యువకుల తీరుపై మీరెలా స్పందిస్తారు? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
— Hardin (@hardintessa143) March 2, 2023