చందు అనే యువకుడు ఓ మహిళ గత కొన్నేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతంగా తయారయ్యారు. ప్రేమలోకంలో తెలియాడుతున్న ఈ జంట పెళ్లి పేరుతో ఒక్కటవ్వాలని ఎన్నో కలలు కన్నారు. కానీ పెద్దలు విరి పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఇద్దరు చెరోదారి చూసుకుని పెళ్లిళ్లు కూడా చేసుకున్నారు. కానీ ఇద్దరికి పెళ్లిళ్లు అయినా కూడా వీరి ప్రేమ మాత్రం ఇంకా పదిలంగానే ఉంది. మరొకరితో పెళ్లైన ఆ మహిళకు ఓ ఐదేళ్ల కుమార్తె కూడా ఉంది.
కానీ ఏదేమైన వీరిద్దరూ మళ్లీ పెళ్లి పేరుతో ఒక్కటవ్వాలనే కలల కంటున్నారు. కానీ వీరి పెళ్లికి సమాజం ఒప్పుకోవడం లేదు. ఏం చేయాలో తెలియక ఇద్దరు సతమతమవుతున్నారు. ఇలా కాదని భావించిన ప్రేమజంట ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచనకు వచ్చారు. ఇక అనుకున్నట్టుగానే అటువైపుగా అడుగులు కూడా వేశారు. ఇందులో భాగంగానే యుమునా నదిలో దూకాలని ప్లాన్ వేసుకుని అక్కడికి చేరుకున్నారు.
ఇది కూడా చదవండి: Visakhapatnam: మొదటి భర్తకు టాటా చెప్పి రెండో పెళ్లి చేసుకుంది! చివరికి ఈ ఒక్క కారణమే విషాదంలో నింపింది!
ఇక వీరి ప్లాన్ ప్రకారం.. ఇద్దరు యమునా నది తీరానికి చేరారు. ఇద్దరు కలిసి దూకేందుకు ప్రయత్నం చేస్తుండగా నీటి తాకిడికి ప్రియుడు చందు భయంతో వెనకడుగు వేయగా ప్రియురాలు అప్పటికే దూకేసింది. ప్రియుడు దూకలేదని తెలుసుకున్న ప్రియురాలు మెల్ల మెల్లగా ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకుంది. అనంతరం నువ్వు నన్ను మోసం చేశావంటూ ప్రియుడిపై ప్రియురాలు కోప్పడింది.
ఇంతటితో ఆగని ప్రియురాలు ఏకంగా ప్రియుడు చందు మోసం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రియురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు చందును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.