ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. రెండో కాన్పులో కూడా ఆడపిల్లకు జన్మనిచ్చిందని మహిళపై భర్తతో పాటు అత్తింటి కుటుంబ నడిరోడ్డుపై నరకం చూపించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది ఉత్తర్ ప్రదేశ్ లోని మహోబా జిల్లాలో రాంనగర్ జుఖా ప్రాంతం. ఇదే గ్రామానికి చెందిన ఓ యువకుడికి గతంలో ఓ మహిళతో వివాహం జరిపించారు.
అయితే పెళ్లైన కొన్నాళ్లకి ఆ మహిళ ఓ ఆడపిల్లకి జన్మనిచ్చింది. దీంతో ఆడ పిల్లను కనిందని భర్తతో పాటు అత్తింటి కుటుంబం ఆ మహిళను సూటిపోటి మాటలతో తీవ్రంగా హింసించారు. అత్తింటి వేధింపులను భరించిన ఆ మహిళ కొంతకాలం సంసారాన్ని నెట్టుకుంటూ వచ్చింది. ఇలా ఉండగానే ఆ మహిళ మరో ఏడాది తర్వాత మరో ఆడపిల్లకు జన్మనిచ్చింది. రెండో కాన్పులో కూడా కోడలు ఆడ పిల్లను కనిందని అత్తింటి కుటుంబం కోపంతో ఊగిపోయింది.
ఇది కూడా చదవండి: Uttar Pradesh: ఫోటో గ్రాఫర్ రాలేదని పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న వధువు!
దీంతో ఆ మహిళను నానా హింసకు గురి చేశారు. ఇక ఇంతటితో ఆగకుండా భర్తతో పాటు అత్తింటి కుటుంబ సభ్యులు ఆ మహిళను నడిరోడ్డు మీదకు లాగి జుట్టుపట్టి కొట్టారు. అందరూ చూస్తుండగానే కాళ్లతో తంతూ తీవ్రంగా దాడికి దిగారు. ఇదే దృశ్యాన్ని కొందరు స్థానికులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. దీంతో ఆ వీడియో వైరల్ గా మారి పోలీసుల వరకూ వెళ్లింది.
ఈ దారుణ ఘటనపై స్పందించిన పోలీసులు భర్తతో పాటు అత్తింటి కుటుంబంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
A woman was mercilessly beaten for not giving birth to a son by her family members in Ramnagar Jukha area of UP’s Mahoba district. All the residents of the area stood as spectators saying that it’s a family matter.
Warning: sensitive content@NCWIndia @Uppolice pic.twitter.com/TKeNd0nP1A— Kanwardeep singh (@KanwardeepsTOI) June 4, 2022