వీడియో: కట్నం తేలేదని కోడలిపై రెచ్చిపోయిన అత్తమామ!

ఈ రోజుల్లో కొంతమంది డబ్బు కోసం ఎంతటి దారుణాలకైన దిగుతున్నారు. మరీ ముఖ్యంగా అదనపు కట్నం తీసుకురావాలంటూ కోడలిని కొందరు అత్తమామలు దారుణంగా హింసిస్తున్నారు. చివరికి హత్య చేయడానికి కూడా వెనకాడడం లేదు. అచ్చం ఇలాగే ఓ మహిళపై అదనపు కట్నం కోసం అత్తమామలు నడి రోడ్డుపై దాడికి దిగారు. ఇదే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  • Written By:
  • Publish Date - June 2, 2023 / 06:20 PM IST

దేశంలో ఎంతో మంది మహిళలు అదనపు కట్నం వేధింపులకు బలవుతున్నారు. పెళ్లైన కొంత కాలం పాటు బాగానే ఉంటున్నారు. ఇక వివాహం జరిగి కొన్ని రోజులు గడుస్తుందో లేదో మెల్లగా మెల్లగా అదనపు కట్నం తేవాలంటూ వేధింపులకు పాల్పడుతున్నారు. ఆ వేధింపులు ఎక్కువవ్వడంతో కొందరు పోలీసులను ఆశ్రయిస్తే, మరికొందరు మాత్రం ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇదిలా ఉంటే, ఇటీవల ఓమహిళను గత కొంత కాలం నుంచి ఆమె అత్తమామ కట్నం తేవాలంటూ వేధించారు. ఇక అంతటితో ఆగకుండా ఇంట్లో నుంచి బయటకు లాగి అందరి ముందు దాడికి దిగారు. ఇప్పుడు ఇదే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఓ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి గత కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. పెళ్లిలో భాగంగా ఆ యువతి తల్లిదండ్రులు అల్లుడికి కట్న కానుకలు బాగానే ముట్టజెప్పారు. అలా కొన్ని రోజులు గడిచింది. దంపతులు దాంపత్య జీవితాన్ని బాగానే గడిపారు. రాను రాను ఆ మహిళ అత్తమామలు అదనపు కట్నం తేవాలంటూ వేధించడం మొదలు పెట్టారు. రోజు రోజుకు ఆ వేధింపులు మరింత ఎక్కువయ్యాయి.

ప్రతీ రోజూ ఆ మహిళను కట్నం కోసం కొట్టడం, తిట్టడం వంటివి చేసేవారు. చాలా కాలం నుంచి ఆ మహిళ అత్తమామలు, వారి బంధువుల టార్చర్ ను భరిస్తూ వచ్చింది. అయితే ఇటీవల కూడా ఆ మహిళతో అత్తింటి బంధువులు వరకట్నం తేవాలంటూ వాగ్వాదానికి దిగారు. అంతేకాకుండా ఆ మహిళను ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు. ఇంతటితో సరిపెట్టని ఓ వ్యక్తి.. చేతిలో గొడ్డలి పట్టి ఆ మహిళపై దాడికి ప్రయత్నించాడు. ఇదంతా గమనించిన కొందరు వ్యక్తులు.. తమ సెల్ ఫోన్ లో వీడియోలు తీసుకున్నారు.

అదే వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారి చివరికి పోలీసుల వరకు వెళ్లింది. దీనిపై పోలీసుల స్పందిస్తూ.. వెంటనే నిందితులను అరెస్ట్ చేశారు. ఇక ఈ వీడియోను చూసిన చాలా మంది నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతుంది. అదనపు కట్నం తేలేదని మహిళపై దాడికి దిగిన అత్తింటి కుటుంబ సభ్యుల దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Show comments
SHARE THIS ARTICLE ON
Read Today's Latest crimeNewsTelugu News LIVE Updates on SumanTV

Most viewed