భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం సహజం. వీటిని పరిష్కరించుకోవడానికి వీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కానీ అవి ఫలించకపోవడం చివరికి గొడవలకు దారి తీస్తుంటాయి. ఆ క్రమంలోనే భార్యపై భర్త, భర్తపై భార్య చేయి చేసుకోవడం జరుగుతుంది. అప్పటి క్షణికావేశంలో కొందరైతే ఎంతటి దారుణానికైన తెగిస్తుంటారు. అలా తెగించిన ఓ భర్త భార్యపై కోపంతో ఊహించని దారుణానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
అసలు ఆ భర్త ఎలాంటి దారుణానికి పాలపడ్డాడు? ఈ ఘటన ఎక్కడ జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అది ఉత్తర్ ప్రదేశ్ లోని బహ్రైచ్ జిల్లాలోని కొరిన్ పూర్వా గ్రామం. ఈ గ్రామంలో తాజాగా ఓ వివాహ వేడుకు జరిగింది. ఈ శుభకార్యానికి రామావతి, హరిరామ్ అనే దంపతులు ఇద్దరు హాజరయ్యారు. అయితే ఈ క్రమంలోనే భార్యాభర్తలిద్దరి మధ్య చిన్నపాటి యుద్దం చోటు చేసుకుంది.
ఇది కూడా చదవండి: kakinada: అత్తను చంపి, గోనెసంచిలో మూటకట్టి, గోదారిలో పడేసిన కోడలు!
అది చినిగి చినిగి వారిద్దరు కొట్టుకునే స్థాయికి వెళ్లింది. దీంతో కోపంతో ఊగిపోయిన భర్త భార్య ముక్కును కొరికాడు. పెళ్లి వేడుకకు వచ్చిన బంధువులంతా వీరి గొడవను సినిమాలాగా చూశారు. ఇక కొంతమంది ఆపే ప్రయత్నం చేసినా కూడా భర్త భార్యపై దారుణంగా చితకబాదాడు. ఈ దృశ్యాన్ని చూసిన కొందరు జనాలు నవ్వుకుంటుంటే మరికొంతమంది గొడవను ఆపేందుకు ప్రయత్నాలు చేశారు. ఇక తీవ్రంగా గాయపడిన రామావతిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై రమావతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక రమావతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.