ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. చిన్న విషయానికి ఓ మహిళ.. తన కోడలితో గొడవ పడింది. అదే కోపంతో అత్త తన కోడలిపై పగ తీర్చుకుంది. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. అసలేం జరిగిందంటే?
అందమైన కోడలు, రాక్షసి లాంటి అత్త. భర్త అత్తమామలతో కలిసి ఈ ఇల్లాలు ఇంట్లోనే ఉండేది. భర్త స్థానికంగా ఓ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. ఇక కొంత వరకు చదువుకున్న ఆ యువతికి ఆమె తల్లిదండ్రులు పెళ్లి చేశారు. పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతులు సంతోషంగానే ఉన్నారు. కట్ చేస్తే.. గత కొంత కాలం నుంచి కోడలిపై అత్త పగ పెంచుకుంది. దీంతో తరుచు ఇద్దరూ గొడవ పడేవారు. ఈ క్రమంలోనే ఇటీవల ఇంట్లో ఎవరూ లేని టైమ్ చూసి అత్త కోడలిపై దారుణానికి పాల్పడింది.
పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్ లోని అమ్రోహ ప్రాంతంలో కోమల్ అనే వివాహిత నివాసం ఉంటుంది. ఆమె తల్లిదండ్రులు గతంలో ఇదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో వివాహం చేశారు. కోమల్ తల్లిదండ్రులు ఆర్థికంగా బలంగానే ఉండడంతో చిన్నప్పటి నుంచి ఇంట్లో పనులు ఎలాంటివి నేర్చుకోకుండా పెరిగింది. ఈ క్రమంలోనే కోమల్ అత్త పెళ్లి సమయంలో ఎక్కువ కట్నం తీసుకురాలేదని కోడలితో వాగ్వాదానికి దిగేది. ఇదే కాకుండా కోడలు ఇంట్లో ఎలాంటి పనులు చేయదనే కారణాన్ని ఎత్తిచూపి ఆమెతో గొడవకు కూడా దిగేది.
ఇటీవల కూడా ఈ అత్తాకోడళ్లు మరోసారి గొడవ పడ్డారు. ఈ నేపథ్యంలోనే అత్త కోపం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. గొడవ అనంతరం కోడలు కోమల్ బెడ్ రూంలోకి వెళ్లి నిద్రపోయింది. ఇదే మంచి సమయం అనుకున్న అత్త.. మెల్లగా కోడలి బెడ్రూంలోకి వెళ్లి తుపాకీతో కోమల్ తలపై కాల్చింది. అత్త దాడిలో కోడలు అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. దీనిపై స్పందించిన స్థానికులు.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కోమల్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. అనుమానంతో మృతురాలి అత్తను అదుపులోకి తీసుకుని విచారించారు.
మొదటగా తనకేం తెలియదన్నట్లుగా సరికొత్త నాటకానికి తెర తీసింది. మా ఇంట్లోకి కొందరు దొంగలు వచ్చారని, విలువైన వస్తువులు దొంగిలించి ఆ తర్వాత నా కోడలిని కాల్చి చంపి వెళ్లిపోయారని తెలిపింది. ఇక ఆ వివాహితపై అనుమానంతో పోలీసులు గట్టిగా విచారించే సరికి కోమల్ అత్త అసలు నిజాన్ని వెళ్లగక్కింది. అవును.. నా కోడలిని నేనే తుపాకీతో కాల్చి చంపాను. ఇంట్లో పనులు చేయకుండా రోజూ నిద్రపోయేదని, ఇదే విషయంపై తరుచు గొడవ పడేవాళ్లమని వివరించింది. ఇక ఈ క్రమంలోనే ఇటీవల మరోసారి గొడవ పడడంతో కోపంతో నా కోడలిని తుపాకీతో కాల్చి చంపానని నిందితురాలు తన నేరాన్ని అంగీకరించింది. ఆ తర్వాత పోలీసులు మృతురాలి అత్తతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.