నేటి కాలంలో పెళ్లైన కొంతమంది మహిళలు కట్టుకున్న భర్తను కాదని వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఇక మరికొంతమంది మాత్రం.. ఏకంగా భర్త, పిల్లలను కాదని చివరికి ప్రియుడితో లేచిపోతున్నారు. ఇదిలా ఉంటే ఉత్తర్ ప్రదేశ్ లో ఓ వ్యక్తి నా భార్య నన్ను కాకుండా మరొకడితో వివాహేతర సంబంధాన్ని నడిపిస్తుందని తరుచు అనుమానించేవాడు. అయితే ఇదే విషయంపై ఇటీవల భార్యతో గొడవ పడ్డ భర్త భార్యను దారుణంగా హత్య చేసి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారింది.
పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్ రాజ్ ఘాట్ పరిధిలోని ఖుర్రాంపూర్ ప్రాంతంలో శరత్ చంద్ర, నీలం దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన కొన్నేళ్ల పాటు దంపతులు ఇద్దరూ బాగానే సంసారం చేశారు. అయితే రాను రాను భర్తకు భార్యపై అనుమానం బలపడింది. నా భార్య నీల నన్ను కాకుండా ఓ కుర్రాడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని శరత్ చంద్ర అనుమానించాడు. ఇదే విషయమై భార్యాభర్తల మధ్య తరుచు గొడవలు కూడా జరిగేవి. ఇకపోతే భర్త శరత్ చంద్ర ఇదే విషయంపై ఇటీవల భార్యతో మరోసారి గొడవకు దిగాడు. దీంతో ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు.
ఆ సమయంలో క్షణికావేశంలో ఊగిపోయిన శరత్ చంద్ర భార్య నీలను దారుణంగా హత్య చేశాడు. అనంతరం అతడు నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి.. నేను నా భార్యను చంపాను, నన్ను అరెస్ట్ చేయండి అంటూ పెద్దగా అరిచాడు. వెంటనే పరుగు పరుగున బయటకు వచ్చిన పోలీసులు.. నిందితుడు శరత్ చంద్రను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నీల మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారింది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలయజేయండి.