భార్యాభర్తల అన్నాక గొడవలు జరగడం సహజం. కానీ, వచ్చిన మనస్పర్థలను సర్దుకుపోవాల్సిన కొందరు దంపతులు క్షణికావేశంలో వారి కోపాన్ని ఇతరులపై చూపిస్తున్నారు. ఇంతటితో ఆగకుండా చివరికి హత్యలు కూడా చేస్తున్నారు. గతంలో కొంతమంది దంపతులు గొడవపడి కోపంలో ఏం చేయాలో తెలియక తమ పిల్లలను హత్య చేస్తున్నారు. అచ్చం ఇలాగే బరితెగించిన ఓ కసాయి తల్లి.. అభం, శుభం తెలియని ముగ్గురు పిల్లలను దారుణంగా హత్య చేసింది. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో వెలుగు చూసిన ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతుంది. ఈ ఘటనలో అసలేం జరిగిదంటే?
పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్ షామ్లీలో ముర్సలిన్, సల్మా దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 2011లో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతుల దాంపత్య జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. అలా కొన్నేళ్ల కాలానికి వీరికి ముగ్గురు పిల్లలు జన్మించారు. పుట్టిన పిల్లలను చదివించుకుంటూ ఈ దంపతులు సంతోషంగానే జీవించారు. అయితే గత కొన్ని రోజుల నుంచి భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చి చేరాయి. దీంతో ఇద్దరూ తరుచు గొడవ పడేవారు. ఇకపోతే ఈ దంపతులు ఇటీవల మరోసారి గొడవ పడ్డారు.
దీంతో ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. ఈ క్రమంలోనే భర్తపై పట్టరాని కోపంతో ఊగిపోయిన భార్య సల్మా.. ఊహించని కిరాతకానికి పాల్పడింది. తన ముగ్గురు పిల్లలకు నీళ్లల్లో ఎలుకల మందు ఇచ్చి తాగించింది. ఆ నీళ్లు తాగిన ఆ పిల్లలు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వెంటనే స్పందించిన భర్త.. ముగ్గురు కూతుళ్లను స్థానిక ఆస్పత్రికి తరలించాడు. అయితే చికిత్స పొందుతూ ఆ ముగ్గురు పిల్లలు ఇటీవల ప్రాణాలు కోల్పోయారు. ఈ వార్తతో తండ్రి ముర్సలిన్ గుండెలు పగిలేలా ఏడ్చారు. అనంతరం భర్త భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. భర్తపై కోపంతో ముగ్గురు పిల్లలను చంపుకున్న ఈ కసాయి తల్లి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.