ఉత్తర్ ప్రదేశ్ లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. భార్య టార్చర్ ను భరించలేని ఓ భర్త నా భార్యతో సంసారం చేయలేనని చేతులెత్తేశాడు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆలీగఢ్ జిల్లాలోని కండెయా గ్రామంలో ఓ వ్యక్తి తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటున్నాడు. అయితే ఇతనికి పెళ్లి వయసు రావడంతో తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టారు. చివరికి బంధువుల అమ్మాయితోనే పెళ్లికి నిశ్చితార్థం పెట్టుకున్నారు.
ఇక పెళ్లి రోజు కూడా రానే వచ్చింది. బంధువుల సమక్షంలో అంగరంగ వైభవంగా వీరి పెళ్లి వేడుకను ఘనంగా నిర్వహించారు. ఇక పెళ్లి తర్వాత జరిగే శోభన కార్యక్రమానికి కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. ముసి ముసి నువ్వులతో బంధువులంతా సంభరపడుతు చెవులు కొరుకుంటున్నారు. ఇక నవ వధువు చేతిలో పాల గ్యాసుతో పాటు సిగ్గును కూడా వెంట తీసుకెళ్లి తల దించుకుని బెడ్ రూంలోకి అడుగులు వేసింది. భార్య రాకను గమనించిన భర్తకు ఎక్కడ ఉత్సాహం, ఊపు కట్టలు తెంచుకుంది. ఇక ఏదేదో చేద్దామని సిద్దమైన భర్తకు నిరాశే ఎదురుంది. అలా వరుసగా మూడు రాత్రులు గడిచాయి. వరుడు మొహంలో చిరునవ్వు లేదు, అనందం అంతకన్న లేదు. దీంతో మరుసటి రోజు మరోసారి నవ దంపతులు ఇద్దరు గదిలోకి వెళ్లారు.
ఈ క్రమంలోనే వారి బెడ్ రూం నుంచి అర్థరాత్రి 12 గంటలకు భర్త అరుపులు, ఏడుస్తున్న శబ్ధాలు బంధువుల చెవిని తాకాయి. కాస్త తేడాగా ఉందేంటి అని బంధువులంతా అనుకుంటున్న క్రమంలోనే వరుడు బెడ్ రూం నుంచి పరుగు పరుగున బయటకొచ్చాడు. రావడమే కాకుండా ఏకంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. ఏం జరిగిందని పోలీసులు వరుడిని ప్రశ్నించగా.. నా భార్య నాకు నరకం చూపిస్తుందని వాపోయాడు. ఎక్కడ పడితే అక్కడ కొరుకుతుందని, పైగా మద్యం సేవించి ఇష్టమొచ్చిన రీతిలో నాపై దాడికి పాల్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలా గత రెండు మూడు రోజుల నుంచి ఇలాగే బాగా టార్చర్ పెడుతుందని వాపోయాడు. ఇక నేను ఆమెతో కాపురం చేయలేనని, ఎలాగైన సరే నాకు న్యాయం చేయాలంటూ పోలీసులను వేడుకున్నాడు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. భర్తను టార్చర్ పెట్టిన ఈ భార్య తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.