మారుతున్న కాలానికి అనుగుణంగా దొంగల ఆలోచనల్లో కూడా మార్పులు వస్తున్నాయి. కష్టపడకుండా తెలివిగా డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నారు. ఇలా ఎంతో మంది టెక్నాలజీని ఆసరాగా చేసుకుని దారుణాలకు పాల్పడుతున్నారు. అచ్చం ఇలాగే ఓ దొంగ పట్టపగలు ఇంట్లో పని చేస్తున్న మహిళకు ఊహించిన షాక్ ఇచ్చాడు. ఆమెకు తెలియకుండా ఇంట్లోకి ప్రవేశించి దొంగతానికి పాల్పడ్డాడు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది. అసలు ఆ వీడియోలో ఏముంది? ఆ యువకుడు ఆ మహిళ కళ్లముందే ఎలాంటి దొంగతనానికి పాల్పడ్డాడనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఉత్తర్ ప్రదేశ్ లోని ఆగ్రాలో ఓ మహిళ నివాసం ఉంటుంది. ఇటీవల ఆ మహిళ ఉదయం పూట తన ఇంట్లో పని చేసుకుంటూ ఉంది. ఈ క్రమంలోనే ఇద్దరు దుండుగులు ఆమె ఇంటి ముందు రెండు మూడు సార్లు బైక్ పై రౌండ్స్ వేశారు. ఇక ఆ మహిళ ఇంట్లో ఒంటరిగా ఉండడం ఆ యువకులు గమనించారు. ఆ యువకులు ఇదే మంచి సమయం అనుకున్నారు. వెంటనే బైక్ దిగి ఓ యువకుడు ఆ మహిళ వద్దకు వెళ్లి.. ఏదో అడ్రస్ అడిగి ఆమెను మాటల్లో పెట్టాడు. మెల్లగా ఏదో ఒకటి మాట్లాడుతూ… వెంటనే ఆమె మెడలో ఉన్న గొలుసును లాక్కిళ్లి బైక్ పై పరారయ్యారు. దీంతో ఆ టైమ్ లో ఆ మహిళకు ఏం చేయాలో అర్థం కాక.. దొంగ దొంగ అని అరిచింది. ఇదంతా స్థానింగా ఉన్న ఓ సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. అదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది.
#TeluguNews pic.twitter.com/KxtUap4FBr
— Hardin (@hardintessa143) December 5, 2022