వాళ్లిద్దరూ భార్యాభర్తలు. వీరికి పెళ్లై చాలా కాలమే అవుతుంది. కొంత కాలానికి పిల్లలు కూడా జన్మించారు. ఇక పుట్టిన పిల్లలతో ఈ దంపతుల సంసారం బాగానే సాగుతూ వచ్చింది. ఇక భార్య బ్కూటీపార్లర్ ను నడపిస్తుండగా, భర్త స్థానికంగా పని చేస్తూ ఉండేవాడు. అలా వచ్చిన డబ్బులతో ఈ భార్యాభర్తలు సంసారాన్ని ఈడ్చుకొచ్చేవారు. అలా ఎంతో అందంగా సాగిన వీరి కాపురంలో ఒక్కసారిగా ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనలో అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తర్ ప్రదేశ్ లోని రాయ్ బరేలీలో అన్నూ, అతుల్ దంపతులు నివాసం ఉంటున్నారు.
గత కొన్నేళ్ల కిందట వీరికి వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు జన్మించారు. భర్త అతుల్ స్థానికంగా పని చేస్తుండగా, భార్య బ్యూటీపార్లర్ ను నడిపిస్తుంది. ఇక ఈ దంపతులు ఇద్దరూ సంపాదిస్తుండడంతో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు రాలేదు. అలా వీరి కాపురం సజావుగానే సాగుతూ వచ్చింది. కానీ కొన్ని రోజుల తర్వాత భర్త అతుల్ తాగుడుకు బానిసయ్యాడు. రోజూ తాగి ఇంటికి రావడం, భార్యతో గొడవ చేయడం. గత కొన్ని రోజుల నుంచి ఇదే జరుగుతుంది. ఇకపోతే భర్త రోజూ సంపాదించిన డబ్బును అంతా తాగుడుకే ఖర్చు పెట్టేవాడు. దీనిని అంతా గమనించిన భార్య అన్నూ.. భర్తకు అనేక సార్లు నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. కానీ భర్త ప్రవర్తనలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. ఏం చేయాలో అర్థం కాని భార్య తరుచూ బాధపడుతూ ఉండేది.
ఇదిలా ఉంటే ఈ నెల 15న భర్త అతుల్ మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. ఇంతటితో ఆగక భార్య అన్నూతో గొడవపడి ఆమెపై దాడి చేశాడు. ఇక ఇన్నాళ్లు భరించిన భార్య.. తట్టుకోలేకపోయింది. పట్టరాని కోపంతో ఊగిపోయి ఇంట్లో ఉన్న కర్రతో భార్తపై దాడి చేసింది. ఈ దాడిలో భర్త అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. భర్త మరణించాడని తెలిసినా భార్య అతని శవం పక్కనే రాత్రంతా పడుకుంది. తెల్లారేసరికి భార్య అన్నూ ఎవరికి తెలియకుండా ఇంటికి తాళం వేసి ఎప్పటిలాగే బ్యూటీపార్లరర్ కు వెళ్లింది. కానీ ఎందుకో స్థానికులకు అనుమానం వచ్చింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ దంపతుల ఇంటికి చేరుకుని అతుల్ మృతదేమాన్ని పరిశీలించారు.
అనంతరం పోలీసులు భార్య అన్నూను విచారించారు. ఏం తెలియనట్టుగా నటించిన భార్య అన్నూ… అతిగా మద్యం సేవించే నా భర్త చనిపోయాడని పొంతనలేని సమాధానాలు చెప్పింది. దీంతో భార్యపై అనుమానం వచ్చిన పోలీసులు గట్టిగా విచారించే సరికి అన్నూ అసలు నిజాలు బయటపెట్టింది. రోజూ మద్యం తాగి హింసిస్తున్నాడని, అందుకే నా భర్తను చంపానని తెలిపింది. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు భార్య అన్నూను అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ క్రైమ్ స్టోరీలో భార్య అన్నూ చేసింది ఎంత వరకు కరెక్ట్? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.