పైన ఫొటోలు కనిపిస్తున్న మహిళ పేరు వందనా శుక్లా. వయసు 28 ఏళ్లు. ఉన్నత చదువులు పూర్తి చేసిన ఆమెకు డాక్టర్ కావాలని చిన్నప్పటి నుంచి ఓ బలమైన కోరిక. ఎలాగైన తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని అనుకుంది. ఇందుకోసం ఆ దిశగా ఉన్నత చదువును పూర్తి చేసింది. ఇక ఈ క్రమంలోనే వందనా శుక్లాకు తల్లిదండ్రులు ఓ డాక్టర్ ను చూసి పెళ్లి చేశారు. పెళ్లైన నాటి నుంచి ఈ దంపతుల దాంపత్య జీవితం బాగానే సాగుతూ వచ్చింది. అలా కొన్నాళ్ల తర్వాత ఈ దంపతులే స్వయంగా ఓ ఆస్పత్రిని నిర్మించుకుని అందులో ఇద్దరూ ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నారు. వీరి జీవితం సంతోషంగా తరుణంలోనే భర్త, ఆమె మామ ఇద్దరూ కలిసి వందనా శుక్లాను దారుణంగా కొట్టి చంపారు. అనంతరం ఆమె శవాన్ని 400 కి. మీ దూరంలో పాతిపెట్టారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలంగా మారుతోంది. భార్యను భర్త ఎందుకు చంపాడు? అసలు ఈ క్రైమ్ స్టోరీలో ఏం జరిగిందనే పూర్తి వివరాలు మీకోసం.
అది ఉత్తర్ ప్రదేశ్ లఖింపూర్ పరిధిలోని రాయ్ పూర్ ప్రాంతం. ఇక్కడే అభిషేక్ దీక్షిత్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి కూడా చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలనే కోరిక ఉండేది. దీని కోసం అభిషేక్ తన లక్ష్యం దిశగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అతని తల్లిదండ్రులు పెళ్లి చేసుకోవాలని కోరారు. ఇక తల్లిదండ్రుల కోరిక మేరకు అభిషేక్ 2014లో వందనా శుక్లా అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. పైగా అమ్మాయి కూడా డాక్టరే. ఇక పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతుల దాంపత్య జీవితం బాగానే సాగింది. అలా వీరి కాపురం సాగుతున్నతరుణంలో ఈ దంపతులు సీతాపూర్ లో సొంతంగా ఓ ఆస్పత్రిని నిర్మించుకున్నారు. ఇదే ఆస్పత్రిలో దంపతులిద్దరూ ప్రాక్టీస్ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే ఏదో కారణంతో భార్యభర్తల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి.దీంతో ఈ దంపతులు తరుచు గొడవ పడేవారు. మాటలతో సరిపెట్టకుండా భౌతిక దాడులు చేసుకునేవారు.
ఇదే.. భర్త అభిషేక్ పెద్దగా నచ్చలేదు. ఎలాగైన భార్య వందనాను ప్రాణాలతో లేకుండా చేయాలనుకున్నాడు. ఇదిలా ఉండగా.., నవంబర్ 26న ఈ దంపతులు మరోసారి గొడవ పడ్డారు. దీంతో భర్త అభిషేక్ కోపం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. పట్టరాని కోపంతో ఊగిపోయిన అభిషేక్ క్షణికావేశంలో తన తండ్రి గౌరీ శంకర్ తో చేతులు కలిపి భార్య వందనాను అతి కిరాతకంగా హత్య చేశారు. ఈ దాడిలో భార్య వందనా రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఇక భార్య చనిపోయిందని తెలుసుకున్న భర్త.. ఆమె శవాన్ని ఏం చేయాలో అర్థం కాలేదు. దీంతో మనోడికి ఓ ఆలోచన వచ్చింది. ఆమె శవాన్ని దగ్గర్లో కాకుండా దూరంగా పాతి పెట్టాలనుకున్నాడు. ఇందులో భాగంగానే భర్త అభిషేక్ తన తండ్రి గౌరీ శంకర్ సాయంతో భార్య శవాన్ని సూట్ కేసులో పెట్టి అంబులెన్స్ లో 400 దూరంలోకి తీసుకెళ్లారు. అనంతరం అక్కడికి చేరుకున్నాక.., ఓ నిర్మానుష్య ప్రాంతంలో భార్య శవాన్ని పాతిపెట్టి చేతులు దులుపుకున్నారు.
ఇక మరుసటి రోజు అభిషేక్.. మొసలి కన్నీరు కారుస్తూ.., నా భార్య కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను సైతం తీసుకుని పరారైంది భర్త ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ మొదలు పెట్టారు. అయితే విచారణలో భాగంగా పోలీసులు భర్త అభిషేక్ ను విచారించారు. అతను పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అతనిపైనే అనుమానం బలపడింది. ఇక పోలీసుల స్టైల్ లో విచారించే సరికి అభిషేక్ అసలు నిజాలు బయటపెట్టాడు. నా భార్యను నేను, నా తండ్రి కలిసి హత్య చేశామని, శవాన్ని 400 దూరంలో పాతిపెట్టామని చేసిన తప్పుని ఒప్పుకున్నాడు. ఆ తర్వాత పోలీసులు నిందితులు అయినా భర్త అభిషేక్, తండ్రి గౌరీ శంకర్ ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలంగా మారింది. కట్టుకున్న భార్య అని చూడకుండా క్షణికావేశంలో భర్త దారుణంగా హత్య చేయడం ఎంత వరకు కరెక్ట్? అసలు ఇలాంటి దుర్మార్గులకి ఎలాంటి శిక్ష విధించాలి? మీ అభిప్రాయాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.